దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. శుబ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి

తిరువనంతపురం: దక్షిణాఫ్రికా-ఏ, భారత్-ఏ జట్ల మధ్య ఐదు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం తొలి మ్యాచ్ జరుగుతుంది. భారత సీనియర్ జట్టులో చోటు ఆశిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది. సత్తా చాటిన ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ సిరీస్‌లోనూ అతడు రాణిస్తే సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫామ్‌లోకి వచ్చేందుకు ఈ సిరీస్ వేదిక:
గాయంతో ప్రపంచకప్‌లో అనూహ్యంగా దూరమైన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా ఈ సిరీస్‌లో ఆడుతున్నాడు. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడిన మనీశ్ పాండే, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌లు కూడా తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ఈ సిరీస్ వేదిక కానుంది. ఇతర ఆటగాళ్లు కృనాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్‌లు కూడా ఈ సిరీస్‌లో ఆడుతున్నారు. ఈ ముగ్గురు విండీస్ పర్యటనలో సత్తా చాటిన విషయం తెలిసిందే.

ఉత్కంఠ భరితంగా సిరీస్:
దక్షిణాఫ్రికా ఎ జట్టులో తెంబా బవుమా, హెండ్రిక్స్, క్లాసెన్, నోర్జే లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఈ సిరీస్ ఆడుతున్నారు. మొత్తంగా అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ ఐదు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ సరికొత్త ప్రయోగం చేపట్టింది. భారత్-ఏకు ఇద్దరు కెప్టెన్‌లను ఎంపిక చేసింది. అంతేకాదు రెండు జట్లను కూడా ప్రకటించింది.

ఒక జట్టు.. ఇద్దరు కెప్టెన్‌లు:
ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు వన్డేలకు మనీశ్ పాండే, చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌లుగా నియమించింది. తొలి మూడు మ్యాచులకు స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అందుబాటులో ఉంటాడు. ఆగస్టు 29, 31, సెప్టెంబర్ 2, 4, 8 తేదీల్లో ఈ వన్డేలు జరుగుతాయి. శుభ్‌మన్‌గిల్, విజయ్ శంకర్, అన్‌మోల్ ప్రీత్, రికీ భుయ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, నితీశ్ రాణాలు ఇద్దరు కెప్టెన్‌ల నేతృత్వంలో ఆడతారు.
నవీన్ కుమార్ సూపర్-10.. ముంబాను చిత్తుచేసి టాప్‌కు చేరిన ఢిల్లీ

బలంగా పాండే జట్టు:
మనీష్ పాండే జట్టుకు ఇషాన్ కిషన్ కీపర్. దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా లాంటి స్టార్ పేసర్లు పాండే జట్టులో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూసుకుంటే పాండే జట్టు బలంగా ఉంది. అయ్యర్ జట్టుకు సంజు శాంసన్ కీపర్. వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, తుషార్ దేశ్ పాండే లాంటి యువ బౌలర్లు అయ్యర్‌కు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications