Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసత్య ప్రచారం చేయడానికి సిగ్గుండాలి.. కుతురు అనారోగ్యవార్తలపై షాహిద్ అఫ్రిది ఫైర్!

Shahid Afridi slams people on social media for spreading fake news

కరాచీ: తన కూతురు అనారోగ్యానికి గురైందంటూ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఖండించాడు. అలాంటిదేం జరగలేదని, ఆ అల్లా దయ వల్ల తన కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశాడు. ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయాడనికి సిగ్గుండాలని మండిపడ్డాడు.

ఇక లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) 2020 సీజన్ నుంచి షాహిద్ అఫ్రిది అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత ఎమర్జన్సీ కారణంగానే తాను ఎల్‌పీఎల్ వీడుతున్నానని అఫ్రిది తెలిపాడు. అలాగే పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మళ్లీ వస్తానన్నాడు.

'దురదృష్టవశాత్తు వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్తున్నాను. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మళ్లీ వస్తాను. ఆల్ ద బెస్ట్'అని ట్వీట్ చేశాడు. ఇక లంక ప్రీమియర్ లీగ్ అధికారి ట్విటర్ పేజీలో అఫ్రిది లీగ్ వీడటానికి గల కారణమేంటో తెలియజేశారు. అతని కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఫొటోతో సహా ట్వీట్ చేశారు.

అయితే అఫ్రిది మాత్రం అలాంటిదేం లేదని,తన కూతురు అసలు అనారోగ్యానికే గురవ్వలేదన్నాడు. జియో టీవీతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహారించాలన్నాడు. అలాగే ఆదివారం తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన కూతురితో దిగిన ఫొటోను పంచుకున్నాడు. 'నా ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ అల్లా దయతో మేమంతా ఆరోగ్యంగానే ఉన్నాం'అని ట్వీట్ చేశాడు.

అఫ్రిది ఆకస్మాత్తుగా లీగ్‌ను వీడటంతో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న గాల్లే గ్లాడియేటర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 40 ఏళ్ల అఫ్రిది పాక్ తరఫున 398 వన్డేలు, 99 టీ20ల్లో 8064, 1416 పరుగులు చేశాడు.

Story first published: Monday, December 14, 2020, 13:24 [IST]
Other articles published on Dec 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+