India vs Pakistan T20 WC ఒత్తిడి జయించిన జట్టుదే విజయం: షాహిద్ అఫ్రిది

కరాచీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఒత్తిడి జయించిన జట్టే విజయం సాధిస్తుందని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. దాయాదుల పోరంటేనే ఒత్తిడితో కూడుకున్నదని, ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వారినే విజయం వరిస్తుందన్నాడు. యూఏఈ వేదికగా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగే ఫస్ట్ మ్యాచ్‌తోనే భారత్ టైటిల్ వేటను ప్రారంభించనుంది. అక్టోబర్ 24న దాయాదుల పోరు జరగనుంది. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాలే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో క్రికెట్ మ్యాచ్‌లు కూడా జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. చివరిసారిగా ఇరు జట్లు 2019 వన్డే వరల్డ్ కప్‌లో తలపడ్డాయి.

భారత్‌దే పై చేయి..
మళ్లీ టీ20 ప్రపంచకప్‌లోనే ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మెగా టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు ఐదు సార్లు తలపడగా.. ఐదింటిలోనూ టీమిండియానే విజయం వరించడం విశేషం. దాంతో ఈ మ్యాచ్‌లోనూ భారతే గెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా పాక్ మాజీ ఆటగాళ్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భారత్‌కు అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ.. పాక్ టీమ్‌కు గెలిచే సత్తా ఉందంటున్నారు.

తప్పులు చేయని టీమ్..
ఈ నేపథ్యంలోనే హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడిన షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఒత్తిడితో కూడుకున్నది. ఆ రోజు మ్యాచ్‌లో ఎవరైతే ఒత్తిడిని అధిగమిస్తారో వాళ్లనే విజయం వరిస్తుంది. అంతేకాకుండా మ్యాచ్‌లో ఎవరు తక్కువ తప్పులు చేస్తారో వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరుజట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ఏ చిన్న తప్పు చేసినా అది జీవితకాలం వెంటాడుతుంది. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మిస్బా హుల్ హక్ చేసిన చిన్న పొరపాటు అతనికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడితే మ్యాచ్‌ను గెలవడం సులువు'' అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.

ఇండియాకు అడ్వాంటేజ్ ఉన్నా..
ఇక మెగాటోర్నీల్లో భారత్‌కు తమపై మంచి రికార్డున్న మాట వాస్తవమేనని పాకిస్థాన్ మాజీ పేసర్ అజార్ మహ్‌మూద్ తెలిపాడు. అయితే మ్యాచ్ రోజు తమ ఆటగాళ్లు రాణిస్తే భారత్‌ను ఓడించగలదని తెలిపాడు. 'భారత్-పాక్ మ్యాచ్ చాలా టఫ్‌గా జరగనుంది. ఎందుకంటే టీ20 ఫార్మాట్‌లో మా ఆటగాళ్లు అద్భుతంగా రాణించగలరు. అంతేకాకుండా భారత్ పటిష్టమైన టీమ్. కచ్చితంగా ఇండియాకు అడ్వాంటేజ్ ఉంది. కానీ మ్యాచ్ రోజు తమ ఆటగాళ్లు క్లిక్ అయితే భారత్‌ను ఓడించగలరు.'అని అజార్ మహ్‌మూద్ చెప్పుకొచ్చాడు.

పాక్ జట్టులో మార్పులు..
మెగా టోర్నీ కోసం ముందస్తుగా ప్రకటించిన 15 మంది సభ్యుల గల జట్టులో పాకిస్థాన్ మూడు మార్పులు చేసింది. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీ, ఫఖర్ జమాన్‌లు జట్టులోకి వచ్చారు. ఇక గాయంతో సోహైబ్ మక్సూద్ ప్రపంచకప్‌కు దూరవమగా.. అతని స్థానంలో సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ఎంపికచేశారు. గతంలో ప్రకటించిన మహ్మద్ హస్నేన్, అజమ్ ఖాన్ స్థానాల్లో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలను తుది 15 మంది జట్టులోకి తీసుకుంది. రిజర్వ్ ఆటగాళ్లలో ఫఖర్ జమాన్ బదులుగా ఖుష్దిల్ షాను తీసుకున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ముందుగా ప్రకటించిన జట్టులో ఫఖర్ జమాన్ రిజర్వ్ ప్లేయర్ కాగా.. ఇప్పుడు తుది 15 మంది జట్టులోకి వచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications