Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌కు వస్తే భారత్‌నే మర్చిపోతాడు: షాహిద్ అఫ్రిది

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కసారి పాకిస్థాన్‌కు వస్తే భారత్‌లో ఉన్న సౌకర్యాలనే మర్చిపోతాడని ఆదేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీకి చాలా మంది అభిమానులన్నారని తెలిపాడు. పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు అభిమానులతో పాటు తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. 2008లో ధోనీ సారథ్యంలోని టీమిండియా చివరిసారిగా పాకిస్థాన్‌లో పర్యటించింది. అప్పటి నుంచి ఇరు దేశాలు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.

Shahid Afridi says if Virat Kohli comes to Pakistan he ll forget the hospitality of India

భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ బరిలోకి దిగింది. కానీ భారత జట్టు మాత్రం తమ ఆటగాళ్లకు సరైన భద్రత లభించదని పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా పాక్‌లో పర్యటించేందుకు అనుమతివ్వలేదు. దాంతోనే పాకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2023‌లో తమ మ్యాచ్‌లను భారత్ తటస్థ వేదికగా ఆడింది.

ఈ టోర్నీని పీసీబీ అధికారులు హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించారు. శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్‌లను నిర్వహించిన పీసీబీ.. మిగతా మ్యాచ్‌లను పాక్‌లో జరిపింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీ అనుమతి కోసం పంపించింది.

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తామని, మొత్తం 3 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయని పీసీబీ తమ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి అందజేసింది. లాహోర్ వేదికగానే భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపింది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టు.. పాకిస్థాన్‌కు వెళ్లదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది.

ఈ టోర్నీలోని తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దుబాయ్‌లో లేదా శ్రీలంకలో తమ మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీని కోరినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌కు రావడంపై షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్రిది చెప్పినట్లు కోహ్లీకి పాక్‌లో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్ జెర్సీలపై కోహ్లీ అని పేరు రాసుకొని చాలా మ్యాచ్‌లకు అభిమానులు హాజరయ్యారు.

Story first published: Thursday, July 11, 2024, 19:03 [IST]
Other articles published on Jul 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+