ఐసీసీ అండతోనే భారత్‌కు విజయాలు.. షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు!

అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో ఐసీసీ అండతోనే టీమిండియా విజయాలు సాధించిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆరోపించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఐసీసీ ఒత్తిడితోనే ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని చెప్పాడు. భారత్‌ను ఎలాగైన సెమీస్ ఆడించాలనే ఉద్దేశంతోనే ఐసీసీ ఇలా వ్యవహరించిందన్నాడు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌పై అక్కసు వెళ్లగక్కే అఫ్రిది.. టీ20 ప్రపంచకప్ 2022లో రోహిత్ సేన విజయాలను ఓర్వలేక ఈ ఆరోపణలు చేస్తున్నాడని అభిమానులు మండిపడుతున్నారు.

సెమీస్‌లో ఆడించాలనే..
బంగ్లాదేశ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడం, ఫేక్ ఫీల్డింగ్.. అని బంగ్లా అభిమానులు, ఆటగాళ్లు సాకులు చెప్పడం కూడా విన్నాం. ఈ విజయంతో పాక్ సెమీస్ ఛాన్స్‌లు కాస్త సంక్లిష్టంగా మారాయి. ఈ క్రమంలోనే షాహిద్ అఫ్రిది సైతం భారత విజయాలను తక్కువ చేసేలా మాట్లాడాడు. భారత్‌ను ఎలాగైనా సెమీస్‌లో ఆడించాలని ఐసీసీ కోరుకుందని, అందుకే పాక్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో టీమిండియాకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించాడు.

మైదానం చిత్తడిగా ఉన్నా..
'బంగ్లాదేశ్ - భారత్ మ్యాచ్‌ను ఓ సారి పరిశీలిస్తే.. వర్షం వల్ల ఔట్ ఫీల్డ్ చాలా చిత్తడిగా ఉంది. అయినప్పటికీ భారత్‌కు అనుకూలంగా ఐసీసీ వ్యవహరించింది. ఎలాగైనా భారత్ సెమీస్ చేర్చాలనేదే ఐసీసీ ఆలోచన. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా వర్షం ఆగిపోగానే.. వెంటనే ప్రారంభించడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయి. ఐసీసీ, భారత్ ఆడటం, తీవ్ర ఒత్తిళ్లు రావడం.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఉత్తమ అంపైరింగ్ అంటూ..
అయితే లిటన్ దాస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బంగ్లాదేశ్ కానీ వికెట్లు కోల్పోకపోతే తప్పకుండా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే పరిస్థితులు వారికి కలిసి రాలేదు. అయినా బంగ్లాదేశ్ చాలా బాగా పోరాడింది. అలాగే భారత్-పాక్ మ్యాచ్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించినవారికి తప్పనిసరిగా ఉత్తమ అంపైరింగ్ అవార్డులు దక్కుతాయి.'అని అఫ్రిది సెటైర్లు పేల్చాడు. భారత్ తన చివరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడిస్తే.. ఎలాంటి సమీకరణాలతో అవసరం లేకుండా అగ్రస్థానంతో సెమీస్‌కు చేరుకొంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications