For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shahid Afridi: బాబర్ ఆజామ్ ఓ చెత్త కెప్టెన్ (వీడియో)

Shahid Afridi: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ షాహిది అఫ్రిది విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజామ్ ఓ విఫల కెప్టెన్ అని, వన్డే ప్రపంచకప్ 2023లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడని తెలిపాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

9 మ్యాచ్‌లకు నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. జట్టులోని ఆటగాళ్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు సైతం టీమ్ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిది అఫ్రిది.. బాబర్ ఆజామ్ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు.

Shahid Afridi says Babar Azam hasnt improved as a leader in last 3-4 years

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ అంచనాల మేరకు రాణించలేకపోయిందన్నాడు. 'నేను బాబర్ ఆజామ్‌కు బిగ్ ఫ్యాన్. బాబర్ ఆజామ్‌ కెప్టెన్సీ విమర్శిస్తే అభిమానులు నన్ను ట్రోల్ చేస్తున్నారు. బాబర్ ఆజామ్ ఎప్పటికీ నాకు తమ్ముడే. బాబర్ ఆజామ్‌ను టాప్ కెప్టెన్లలో ఒకడిగా చూడాలనుకున్నాను.

గత నాలుగేళ్లుగా అతను పాకిస్థాన్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నాలుగేళ్లలో ఏ రోజు కూడా అతని కెప్టెన్సీని మేం తప్పుబట్టలేదు. మేమంతా మద్దతుగా నిలిచాం. ఈ 3-4 ఏళ్లలో అతను మరింత మెరుగవుతాడని భావించాం. కెప్టెన్‌గా.. ప్లేయర్‌గా తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేస్తాడని ఆశించాం. కానీ అది జరగలేదు.

అతని సారథ్యంలో మేం చాలా తప్పిదాలు చూశాం. లీడర్ అనేవాడు బలంగా ఉండాలి. జట్టులోని ప్రతీ ఒక్కరితో అన్యోన్యంగా ఉండాలి. నాయకుడు అనేవాడు ఒకరిద్దరికే పరిమితం అయితే మిగతా ఆటగాళ్లను ఎవరు నడిపించాలి? అందుకే బాబర్ ఆజామ్ ఓ విఫల కెప్టెన్. సారథిగా తనను తాను నిరూపించుకోవడానికి నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చారు.

ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జట్టులోని ఆటగాళ్లను సరిగ్గా వాడుకోలేదు. యూనిస్ ఖాన్ నాయకత్వ లక్షణాలు బాబర్ ఆజామ్‌లో లేవు.'అని షాహిది అఫ్రిది చెప్పుకొచ్చాడు.

అల్లుడు షాహిన్ అఫ్రిది కోసమే బాబర్ ఆజామ్‌పై షాహిది అఫ్రిది విమర్శలు గుప్పిస్తున్నాడని పాకిస్థాన్ అభిమానులు మండిపడుతున్నారు. షాహిద్ అఫ్రిది తన కెరీర్‌లో బాబర్ ఆజామ్ కంటే గొప్పగా ఏం చేశాడో చెప్పాలని నిలదీస్తున్నారు.

Story first published: Monday, November 13, 2023, 19:47 [IST]
Other articles published on Nov 13, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+