Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే సురేశ్ రైనా ఆ పోస్ట్ డిలీట్ చేశాడు: షాహిద్ అఫ్రిది

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ ఓ పోస్ట్‌ చేశాడు. సురేశ్‌రైనాను ట్రోల్ చేస్తూ ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ చేసిన పోస్ట్‌కు బదులుగా రైనా తనదైన శైలిలో బదులిచ్చాడు. దాంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ తర్వాత రైనా.. ఆ పోస్ట్‌ను తొలిగించాడు.

అయితే రైనా ఆ పోస్ట్ తొలగించడానికి గల కారణాన్ని షాహిద్ అఫ్రిది తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రైనా తనకు మంచి స్నేహితుడని, ఆ చనువుతోనే ఆ పోస్ట్ తొలిగించాలని కోరానని చెప్పాడు.

Shahid Afridi reveals he convinced Suresh Raina to delete social media post about T20 WC ambassador

సురేశ్ రైనా నా ఫ్రెండ్..
'సురేశ్ రైనా నాకు మంచి స్నేహితుడు. క్రికెట్‌కు సంబంధించిన చాలా విషయాలను మేం తరుచూ మాట్లాడుకుంటాం. ఈ చర్చలో భాగంగా మా మధ్య చిన్నపాటి వాగ్వాదమూ కూడా చోటు చేసుకుంటుంది. కానీ అదంతా ఆ క్షణం వరకే. ఆ తర్వాత అంతా మాములు అయిపోతుంది.

సోషల్ మీడియాలో సురేశ్ రైనా పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత అతనితో మాట్లాడాను. సోదరుడిగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడు అంతా బాగుంది. పొరపాటును సరిదిద్దుకోవడం గొప్ప విషయం'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

అసలు ఆ పోస్ట్ ఏంటంటే..?
ఐపీఎల్ 2024 సీజన్‌లో సురేశ్ రైనా కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా తన సహచర కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రిటైర్మెంట్‌పై పునరాచోలన చేస్తావా? అని రైనాను ప్రశ్నించాడు. దానికి రైనా.. యూటర్న్ తీసుకునేందుకు తాను ఏమైనా షాహిద్ అఫ్రిదినా? అని బదులిచ్చాడు.

షాహిద్ అఫ్రిది తన కెరీర్‌లో చాలా సార్లు రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అఫ్రిది పేరు చెప్పి రైనా నవ్వులు పూయించాడు. ఇక రైనా కామెంట్స్‌ను మనసులో పెట్టుకున్న ఓ పాక్ జర్నలిస్ట్ ఇమ్రాన్ సిద్దిఖ్ అదును కోసం ఎదురు చూసి.. రైనాను ట్రోల్ చేశాడు.

రైనాను ట్రోల్ చేసిన పాక్ జర్నలిస్ట్..
షాహిది అఫ్రిదిని ఐసీసీ.. టీ20 ప్రపంచకప్‌కు ప్రచారకర్తగా ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సురేశ్ రైనాను ఇమ్రాన్ ఎగతాళి చేసే ప్రయత్నం చేశాడు. 'షాహిద్ అఫ్రిదిని ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా ప్రకటించింది. హలో సురేశ్ రైనా ఇప్పుడు ఏం అంటావ్?'అని ట్వీట్ చేశాడు.

ఇందుకు సురేశ్ రైనా దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. 'నేనేం ఐసీసీ ప్రచారకర్తను కాదు. కానీ 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మోహాలీలో మేం ఆడిన మ్యాచ్ గుర్తుందా? నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు మరిచిపోలేని జ్ఞాపకాలను గుర్తు చేస్తుందనుకుంటా?' అని నోరు మూయించాడు. షాహిద్ అఫ్రిది రిక్వెస్ట్‌తో ఆ పోస్ట్‌ను రైనా తొలగించాడు.

Story first published: Thursday, May 30, 2024, 19:04 [IST]
Other articles published on May 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+