For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికీ పాంటింగ్ కన్నా ధోనీనే బెస్ట్ కెప్టెన్: షాహిద్ అఫ్రిది

Shahid Afridi picks the better captain between MS Dhoni and Ricky Ponting

కరాచీ: తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌లో బెస్ట్ కెప్టెన్ ఎవరని ప్రశ్నించగా ఏమాత్రం సంకోచించకుండా తనదైన శైలిలో బదులిచ్చాడు. బుధవారం ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన అఫ్రిది.. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా ఓపికగా బదులిచ్చాడు.

ధోనీనే బెస్ట్..

ధోనీనే బెస్ట్..

ఈ నేపథ్యంలో ఓ అభిమాని..‘బెటర్ కెప్టెన్ ధోనీ లేక పాంటింగ్? లాలా చాయిస్?'అని ప్రశ్నించాడు. దీనికి అఫ్రిది తనకు బెస్ట్ కెప్టెన్ ధోనీనే అని బదులిచ్చాడు. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. ‘నా దృష్టిలో పాంటింగ్ కన్నా ధోనీనే గొప్ప బ్యాట్స్‌మన్. ఎందుకంటే అతను యువ ఆటగాళ్లతో కూడిన జట్టు తయారు చేసుకున్నాడు.'అని అఫ్రిది పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అఫ్రిది సమాధానంతో ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కరోనాను జయించి..

కరోనాను జయించి..

గత నెల 13న కరోనా బారిన పడిన అఫ్రిది కుటుంబం 15 రోజుల చికిత్స అనంతరం కోలుకుంది. 'ఆ అల్లా దయవల్ల నేను, నా సతీమణి, కూతుళ్లు అక్సా, అన్షా కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. మేం కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధించిన మీ అందరికి కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయమిది'అని అఫ్రిది అప్పట్లో ట్వీట్‌ చేశాడు.

ది బెస్ట్ కెప్టెన్స్..

ది బెస్ట్ కెప్టెన్స్..

క్రికెట్ చరిత్రలో ధోనీ, పాంటింగ్ అత్యంత విజయవంతమైన కెప్టెన్లు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వారు సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీతో ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథిగా ధోనీ గుర్తింపుపొందాడు. ఇక పాంటింగ్ ఆస్ట్రేలియాకు 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లు అందించాడు.

ఇక అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రికార్డును కూడా ధోనీ సొంతం చేసుకున్నాడు. ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇందులో భారత్ 178 గెలిచి, 120 ఓడింది. 6 మ్యాచ్‌లు టై అవ్వగా.. 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ధోనీ విజయాల శాతం 53.61 ఉంది.

ఇక పాంటింగ్ మూడు ఫార్మాట్లలో 324 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించగా.. ఆసీస్ 220 విజయాలందుకొని, 77 మ్యాచ్‌ల్లో ఓడింది. 2 టై కాగా.. 13 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి.

Story first published: Thursday, July 30, 2020, 13:48 [IST]
Other articles published on Jul 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+