Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పబ్లిసిటీ కోసం అసత్య ఆరోపణలు.. కనేరియా కామెంట్స్‌పై అఫ్రిది ఫైర్!

 Shahid Afridi hits back at Danish Kaneria after serious allegations

కరాచీ: పబ్లిసిటీ కోసమే డానిష్ కనేరియా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. కారక్టర్ లెస్ అంటూ తనను దూషిస్తున్న కనేరియా ముందు తన క్యారక్టరేంటో తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికాడు. ఇక షాహిద్ అఫ్రిది ఒక లత్కోర్ అంటూ కనేరియా మండిపడిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా అఫ్రిదిపై సంచలన ఆరోపణలు చేశాడు. హిందువునైన తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒతి చేశాడని, హిందువులకు పాక్‌లో చోటు లేదంటూ అవమానపరిచాడని పేర్కొన్నాడు. ఇక కనేరియా వ్యాఖ్యలపై తాజాగా అఫ్రిది స్పందించాడు.

 అప్పుడేం చేసిండు...

అప్పుడేం చేసిండు...

తనపై చిల్లర ఆరోపణలు చేస్తూ శత్రు దేశానికి(భారతదేశం) చెందిన మీడియా చానెల్‌కు ఇంటర్య్వూ ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'డానిష్ కనేరియా ఆరోపించినట్లు తాను లత్కోర్‌గాడినైతే..అప్పుడే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఎందుకు ఫిర్యాదు చేయలేదు.? కేవలం పబ్లిసిటీ కోసమే కనేరియా ఇదంతా చేస్తున్నాడు. కనేరియా నాకు సోదరుడు లాంటివాడు. కొన్నేళ్లపాటు ఇద్దరం కలిసి పాకిస్థాన్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాం. అది మరిచిపోయి పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. నన్ను అబద్దాల కోరు.. క్యారెక్టర్ లేనివాడు అనే ముందు అతని క్యారెక్టర్ ఏంటో చూసుకుంటే బాగుంటుంది. అతను మన శత్రు దేశమైన భారత్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ మత చిచ్చు రగిలేలా ప్రయత్నిస్తున్నాడు. ఇది అంత మంచి పరిణామం కాదు.'అని అఫ్రిది ఆగ్రహం వక్తం చేశాడు.

మీరు మీరు తేల్చుకోండి..

మీరు మీరు తేల్చుకోండి..

అయితే అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు ఘాటుగా స్పందించారు. 'కనేరియా నీపై ఆరోపణలు చేశాడు నిజమే.. ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మధ్యలో మా దేశాన్ని ఎందుకు లాగుతున్నారు'అని మండిపడుతున్నారు. 'ఒక ఆటగాడు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఆయా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ క్రమంలో మా దేశానికి చెందిన ప్రముఖ చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చి ఉండొచ్చు. అసలు మత చిచ్చు రగిలిస్తుంది నువ్వు(అఫ్రిది).. శత్రుదేశం అని సంభోదించినప్పుడే నీ క్యారెక్టర్‌ ఏంటో అర్థమైంది'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హిందువునని ద్వేషించేవాడు..

హిందువునని ద్వేషించేవాడు..

తాను హిందువునని అఫ్రిది ద్వేషించేవాడని ఇటీవల డానిష్ కనేరియా ఆరోపించిన విషయం తెలిసిందే. 'పాకిస్తాన్‌ జట్టుకు ఆడినంత కాలం షాహిద్‌ అఫ్రిది నన్ను హేళన చేసేవాడు. తోటి ఆటగాళ్ల ముందు అవమానపరుస్తూ మాట్లాడేవాడు. ఇద్దరం కలిసి చాలా ఏళ్లపాటు పాకిస్థాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాం. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్‌కే పరిమితం చేసేవాడు. అతని కారణంగా చాలా వన్డే మ్యాచ్‌లకు నేను దూరం కావాల్సి వచ్చింది. అంతేకాకుండా హిందవునైన నాకు పాకిస్థాన్‌లో చోటు లేదని.. జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు నూరిపోసేవాడు.

ఫిక్సింగ్‌తో..

ఫిక్సింగ్‌తో..

డానిష్‌ కనేరియా 2000 సంవత్సరం నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. పాక్‌ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 2009లో ఇంగ్లీష్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌ ప్రో లీగ్‌లో భాగంగా కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్‌ ఆరోపణలు నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ కూడా సమర్థించింది. అప్పటి నుంచి అతనిపై నిషేధం కొనసాగుతుండగా.. ఎత్తేయాలని ఎంత మొరపెట్టుకున్నా పీసీబీ కనికరించడం లేదు.

Story first published: Friday, May 6, 2022, 22:42 [IST]
Other articles published on May 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+