
ఎలాంటి ఎఫైర్ లేదు..
అయితే అక్సా, షాహిన్ రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలడంతోనే వివాహం చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని అఫ్రిది ఖండించాడు. షాహిన్‌తో తన కూతురుకు ఎలాంటి ఎఫైర్ లేదని, పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం నిశ్చయమైందని స్పష్టం చేశాడు. ఇంతకుముందు షాహిన్ కుటుంబంతో తమకు ఎలాంటి సత్సంబంధాలు కూడా లేవని, ఇరు కుటుంబాలు భిన్న తెగలకు చెందినవని చెప్పుకొచ్చాడు. షాహిన్ పేరేంట్స్ తన కూతురును కోడలుగా చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారని, దాంతోనే ఈ సంబంధం ఏర్పడిందన్నాడు.

పెళ్లి ఇప్పుడే కాదు..
'మా అఫ్రిదిలు మొత్తం 8 రకాల తెగలున్నాయి. షాహిన్ అఫ్రిది, మేం విభిన్న తెగలకు చెందినవాళ్లం.'అని పాకిస్థాన్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక వివాహం ఎప్పుడన్న ప్రశ్నకు షాహిన్, అక్సా తమ కెరీర్‌లపై దృష్టిసారించారని తెలిపాడు. 'నా కూతురు అక్సా డాక్టర్ చదువుతుంది.. త్వరలోనే విదేశాలకు వెళ్లాలనుకుంటుంది. షాహిన్ కూడా తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. కాబట్టి ఇద్దరు తమ కెరీర్‌లో స్థిరపడ్డాకే నిఖా అనుకుంటున్నాం.. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీనికి అంగీకరించడం జరిగిపోయింది.’అని తెలిపాడు. అఫ్రిది వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పట్లో వీరి వివాహం జరిగేలా లేదు.

2018లో అరంగేట్రం
షాహీన్ అఫ్రిదీ 2018లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 17 టెస్టులు, 25 వన్డేలు, 25టీ20 మ్యాచ్‌లాడాడు. అనతి కాలంలోనే స్టార్ పేసర్‌గా ఎదిగాడు. ఇప్పటికే 136 వికెట్లు తీసిన ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్.. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కరోనాతో వాయిదా పడ్డ పాకిస్థాన్ సూపర్ లీగ్ 6వ సీజన్‌లో అఫ్రిదీతో కలిసి షహీన్ ఆడాడు. షాహీన్ లాహోర్ క్యూలాండర్స్‌కు.. షాహిద్ ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. షాహీన్ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












