Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gambhir vs Afridi:దటీజ్ క్రికెట్.. శతృవులు.. మిత్రులయ్యారు! (వీడియో)

 Shahid Afridi Checks On Gautam Gambhir After India opener Gets Hit On Helmet Goes Viral

దోహా: ఉప్పు-నిప్పుగా ఉండే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఒక్కటయ్యారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ మాస్టర్స్ టోర్నీ సందర్భంగా మరోసారి మైదానంలోకి దిగిన ఈ ఇద్దరూ గతంలో కాకుండా.. చాలా ఫ్రెండ్లీగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి అతని ముఖానికి తగలగా.. షాహిద్ అఫ్రిది వచ్చి గాయం గురించి ఆరా తీయడం కూడా అందర్నీ ఆకట్టుకుంది.

గంభీర్‌కు బంతి తగలడంతో..

భారత ఇన్నింగ్స్ సందర్భంగా 11వ ఓవర్‌లో అబ్దుల్ రజాక్ వేసిన బౌలింగ్‌లో గంభీర్ ముందుకు జరిగి బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి మిస్సై అతని ముఖానికి బలంగా తాకింది. ఇది గమనించిన అఫ్రిది.. గంభీర్ దగ్గరకు వచ్చి అంతా ఓకేనా.. ఏమైనా గాయాలు అయ్యాయా? అని ఆరా తీసాడు. దానికి అలాంటిదేం లేదని గంభీర్ బదులిచ్చాడు.

మిస్బా ఉల్ హక్ హాఫ్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది సారథ్యం వహించిన ఏషియన్ లయన్స్ 9 పరుగులతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఏషియన్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. మిస్బా ఉల్ హక్(50 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఉపుల్ తరంగా(39 బంతుల్లో 2 సిక్స్‌లతో 40) విలువైన పరుగులు చేశాడు. ఇండియా మహారాజాస్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, పర్విందర్ అవన రెండేసి వికెట్లు తీయగా.. ఇర్ఫాన్ ఫటాన్, అశోక్ దిండా తలో వికెట్ పడగొట్టారు.

గంభీర్ పోరాడినా..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇండియా మహరాజాస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసి ఓటమిపాలైంది. గౌతమ్ గంభీర్(39 బంతుల్లో 7 ఫోర్లతో 54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మురళీ విజయ్(25), మహమ్మద్ కైఫ్(22), ఇర్ఫాన్ పఠాన్(19) పర్వాలేదనిపించారు. ఏషియన్ లయన్స్ బౌలింగ్‌లో సోహైల్ తన్వీర్ మూడు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా, తిలకరత్నే దిల్షాన్, తిసారా పెరీరా, అబ్దుల్ రజాక్ తలో వికెట్ తీసారు.

 ప్రేమను పంచేందుకు...

ప్రేమను పంచేందుకు...

మ్యాచ్ అనంతరం షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. ప్రేమను పంచేందుకే క్రికెట్ ఆడుతున్నామని తెలిపాడు. షాహిద్ అఫ్రిది త్వరలోనే మైదానంలోకి వస్తాడని, తనతో సహా మరికొంతమంది ఆటగాళ్లు రెస్ట్ తీసుకుంటే బరిలోకి దిగుతాడని చమత్కరించాడు. గంభీర్ మాట్లాడుతూ.. మిస్బా ఉల్ హక్ అద్భుతంగా ఆడాడని, సోహైల్ తన్వీర్, పెరీరా సూపర్ బౌలింగ్‌తో మా ఓటమిని శాసించారని కొనియాడాడు.

Story first published: Saturday, March 11, 2023, 10:15 [IST]
Other articles published on Mar 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+