Shahid Afridi: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ సరైనోడు.. కోహ్లీ ఆటగాడిగా కొనసాగాలి.!

దుబాయ్: టీమిండియా సారథిగా రోహిత్ శర్మను నియమించడం సరైన నిర్ణయమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అన్నాడు. విరాట్ కోహ్లీ తన సారథ్య బాధ్యతలను రోహిత్‌కు ఇచ్చి ఆటగాడిగా తన బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో రోహిత్ శర్మను కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరగనున్న మూడు టీ20ల సిరీస్ నుంచి రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

రోహిత్ సరైనోడు..
రోహిత్ కెప్టెన్సీ నియామకంపై సామా టీవీతో మాట్లాడిన అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం వల్ల విరాట్ కోహ్లీ మరింత కాలం బ్యాటర్‌గా రాణిస్తాడని పేర్కొన్నాడు. కోహ్లీ సేవలు టీమ్ఇండియాకు చాలా అవసరమని.. అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుంటే తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని సూచించాడు. 'నేను ఐపీఎల్‌లో డక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మతో కలిసి ఆడాను. అతని ఆటను చాలా దగ్గర్నుంచి గమనించా. అతడు గొప్ప బ్యాట్స్‌మన్. షాట్ల ఎంపిక గొప్పగా ఉంటుంది. అతడు జట్టు అవసరాలను బట్టి దూకుడుగాను ఆడగలడు. క్లిష్టపరిస్థితుల్లో నిలకడగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చగలడు. టీమిండియా కెప్టెన్సీ మార్పు సరైనదే. రోహిత్‌కు ఓ అవకాశం ఇవ్వాలి" అని అఫ్రిది సూచించాడు.

కెప్టెన్సీ అంత ఈజీకాదు..
'కెప్టెన్సీ అనేది ఆశమాషి వ్యవహారం కాదు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ జట్లకు నాయకత్వం వహించడం అంత సులువైన పనికాదు. చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. జట్టు రాణిస్తున్నంత కాలం అందరూ పొగుడుతూనే ఉంటారు. ఒకవేళ విఫలమైతే అభిమానులు జీర్ణించుకోలేరు. సారథ్య బాధ్యతలను మోస్తూ కోహ్లీ బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుని.. ఆటగాడిగా కొనసాగాలి. నాణ్యమైన బ్యాటర్‌గా అతడి సేవలు టీమిండియాకు చాలా అవసరం. అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది" అని అఫ్రిది పేర్కొన్నాడు.

ఏం అల్లుడూ గిట్ల చేస్తివి?
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఓటమి స్పందించిన అఫ్రిది.. తనకు కాబోయే అల్లుడు షాహిన్ అఫ్రిదీని మందలించాడు. మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ వదిలినా.. షాహిన్ షా అఫ్రిది మూడు సిక్స్‌లు ఇవ్వాల్సింది కాదన్నాడు. షాహిన్ బౌలింగ్ తీరు తనకు ఆగ్రహం తెప్పించిందని, అతను వైడ్ యార్కర్లు వేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
'షాహిన్ బౌలింగ్ తీరు నాకు ఆగ్రహం తెప్పించింది. హసన్ అలీ క్యాచ్ జార విడిచినా షాహిన్ మూడు సిక్స్‌లు ఇవ్వకుండా అడ్డుకోవాల్సింది. అతను బ్యాటర్ రీజియన్‌లో బౌలింగ్ చేయడానికి బదులు వైడ్ యార్కర్‌లు వేయాల్సింది. ఫీల్డర్ క్యాచ్ నేలపాలు చేస్తే.. తరువాతి బంతులు బౌండరీలు ఇవ్వాలని కాదు.
షాహిన్ బౌలింగ్‌లో మంచి పేస్ ఉంది. అతి త్వరలోనే ఈ తప్పిదం నుంచి గుణపాఠం నేర్చుకుంటాడని భావిస్తున్నా. బ్యాట్స్‌మన్ అలా సిక్సర్లు కొట్టే బౌలర్ అయితే అతను కాదు.'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications