For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో చూడలేదు: షాహీన్ అఫ్రిది

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌పై పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ గొప్ప ప్లేయర్ అంటూ కితాబిచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని కొనియాడాడు. తన కెరీర్‌లోనే అలాంటి ఇన్నింగ్స్ చూడలేదన్నాడు.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహీన్ అఫ్రిది ఈ విషయం చెప్పుకొచ్చాడు. 'విరాట్ కోహ్లీ(58 బంతుల్లో 82 నాటౌట్) ఇన్నింగ్స్ అద్భుతం. నా కెరీర్‌లోనే ఇంతకంటే మెరుగైన ఇన్నింగ్స్ చూడలేదు. విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. దిగ్గజ ఆటగాళ్లు మాత్రమే కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఆడగలరు. హారిస్ రౌఫ్ వేసిన అద్భుతమైన బంతిని కోహ్లీ నేరుగా సిక్సర్‌గా మలిచిన తీరు అసాధారణం.'అని షాహిన్ షా అఫ్రిది చెప్పుకొచ్చాడు.

Shaheen Shah Afridi says I have never seen a better innings than Virat Kohli s 82 runs innings

క్రికెట్ ప్రపంచం మెచ్చిన ఇన్నింగ్స్..
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ ఎంత చెప్పుకున్నా తక్కువే. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యద్బుతమైన ఇన్నింగ్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు.

ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ 19వ ఓవర్‌ చివరి రెండు బంతులకు విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు అత్యద్భుతమైనవిగా చరిత్రకెక్కాయి. క్రికెట్ అభిమానులే కాదు చాలా మంది మాజీ క్రికెటర్లు విరాట్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్ చరిత్రలోనే మరుపరాని ఇన్నింగ్స్ అంటూ కొనియాడారు.

Shaheen Shah Afridi says I have never seen a better innings than Virat Kohli s 82 runs innings

కోహ్లీ మాత్రమే ఆడగలడు..
రెండు సిక్స్‌లు సమర్పించుకున్న హారీస్ రౌఫ్ కూడా కోహ్లీ ఇన్నింగ్స్‌ను ఓ ఇంటర్వ్యూలో కొనియాడాడు. 'ఆ రెండు సిక్స్‌లు విరాట్ కాకుండా మరే ప్లేయర్ కొట్టినా నా మనసుకు బాధ కలిగేది. కోహ్లీ తప్ప మరేవరూ కూడా నా బౌలింగ్‌లో అలాంటి షాట్లు ఆడలేరు. వరల్డ్ కప్‌లో అతను ఆడిన విధానం అద్భుతం. ప్యూర్ క్లాస్ బ్యాటింగ్. భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో నేను తొలి 4 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాను.

చివరి ఓవర్ మహమ్మద్ నవాజ్‌దేనని నాకు తెలుసు. అతను స్పిన్నర్ కావడంతో అతనికి డిఫెండ్ చేయడానికి 20 పరుగులైనా ఇవ్వాలనుకున్నాను. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన పరిస్థితి. స్లోయర్‌గా వేసిన మూడు బంతులకు విరాట్ తడబడ్డాడు. ఒక బాల్ క్విక్‌గా వేస్తే బౌండరీ బాదాడు. దాంతో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ జోన్ వైపు ఆడేలా స్లోయర్ బాల్ వేయాలనేది ప్లాన్.

స్క్వేర్ సైడ్ బౌండరీ కూడా చాలా పెద్దగా ఉంది. కానీ విరాట్ ఆఫ్ ద లెంగ్త్ వచ్చి హిట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. అతను కొట్టిన విధానం క్లాస్. నా ప్రణాళికలు సరైనవే అయినా విరాట్ తన క్లాస్ బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టాడు.'అని హరీస్ రౌఫ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, August 21, 2024, 10:45 [IST]
Other articles published on Aug 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+