Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shaheen Afridi: అతని వల్లే గెలిచాం

ఇఫ్తికర్ అహ్మద్ అద్బుత ప్రదర్శనతోనే న్యూజిలాండ్‌తో చివరి టీ20లో విజయం సాధించామని పాకిస్థాన్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇఫ్తికర్ అహ్మద్(3/24) సంచలన బౌలింగ్‌తో పాకిస్థాన్ 42 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

ఐదు టీ20ల సిరీస్‌‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్థాన్.. చివరి మ్యాచ్‌లో విజయం సాధించి క్లీన్ స్వీప్ గండాన్ని గట్టెక్కింది. పాకిస్థాన్ కెప్టెన్‌గా షాహిన్ అఫ్రిదికి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన షాహిన్ అఫ్రిది.. ఇఫ్తికర్ అహ్మద్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

Shaheen Shah Afridi Reveals Reason Behind Pakistans Win In 5th T20I vs New Zealand

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసం 16-20 ఆటగాళ్లను ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. 'ఇఫ్తికర్ అహ్మద్ ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. అతను బౌలింగ్ చేసేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. కానీ మేం ప్రతీ ఒక్కరికి సరైన అవకాశం ఇవ్వాలనుకున్నాం. ఈ సిరీస్‌లో కుర్రాళ్లకు ప్రాధాన్యత ఇచ్చాం.

అప్‌కమింగ్ వరల్డ్ కప్ కోసం 16-20 మంది ఆటగాళ్లను ప్రయత్నించాలనుకుంటున్నాం. అందులో నుంచి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకుంటాం. మైదానానికి వచ్చిన మాకు మద్దతు తెలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'అని షాహిన్ అఫ్రిది చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయని ఇఫ్తికర్ అహ్మద్.. చివరి మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబర్చాడు. మూడు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు.

తన ప్రదర్శనపై ఇఫ్తికర్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశాడు. పిచ్ తగట్లు బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టానని చెప్పాడు. వికెట్‌పై టర్నింగ్ లభించడంతో వికెట్ టు వికెట్ బౌలింగ్ చేశానని చెప్పిన ఇఫ్తికర్.. ఈ రోజే తనకు బౌలింగ్ చేసే అవకాశం దక్కిందన్నాడు.

మ్యాచ్‌కు ముందే బౌలింగ్ చేసే విషయాన్ని షాహిన్ అఫ్రిది చెప్పాడని, అందుకు తగ్గట్లుగానే తాను ప్రిపేరయ్యానని తెలిపాడు. కెప్టెన్‌ ఆదేశాల ప్రకారం బౌలింగ్ చేసి సత్తా చాటేందుకు తాను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని చెప్పాడు. గతంలో కూడా తాను రాణించానని గుర్తు చేశాడు.

Story first published: Sunday, January 21, 2024, 10:30 [IST]
Other articles published on Jan 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+