Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాకాసి బౌలింగ్.. షాహిన్ అఫ్రిదిపై సస్పెన్షన్(వీడియో)

పాకిస్థాన్ ప్రీమియం బౌలర్‌గా చెప్పుకునే షాహీన్ షా అఫ్రిదికి ఘోర అవమానం ఎదురైంది. నిబంధనలకు విరుద్దుంగా బౌలింగ్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ అతని బౌలింగ్‌‌ను రద్దు చేశాడు. ఓవర్ మధ్యలోనే అతనిపై సస్పెన్షన్ విధిస్తూ ఈ చర్యలు తీసుకున్నాడు. ఈ ఘటన ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. ఈ అనూహ్య సంఘటనతో అఫ్రిది అవాక్కయ్యాడు. బీబీఎల్‌లో షాహీన్ షా అఫ్రిదికి ఇది అరంగేట్ర మ్యాచ్‌ కావడం కొసమెరుపు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షాహీన్ షా అఫ్రిది.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో రెండు బీమర్స్ వేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు. మెల్‌బోర్న్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని హైఫుల్ టాస్‌గా వేయగా.. హెల్మెట్‌కు తాకింది. అంపైర్ నోబాల్ ఇవ్వడంతో తొలి బీమర్‌గా వార్నింగ్ ఇచ్చాడు. నాలుగో బంతిని మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ దిశగా ఫుల్‌టాస్ వేసాడు. ఈ బంతిని కూడా అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. ఇక ఐదో బంతిని మరోసారి బీమర్ వేయడంతో అంపైర్ నోబాల్ ఇచ్చి బౌలర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

Shaheen Afridi Pulled Out of Attack for Dangerous Bowling on BBL Debut

ఐసీసీ రూల్స్ ప్రకారం ఒకే ఓవర్‌లో రెండు బీమర్స్ వేస్తే బౌలర్‌ను మ్యాచ్ మొత్తం మళ్లీ బౌలింగ్ చేయకుండా సస్పెండ్ విధిస్తారు. షాహిన్ అఫ్రిది విషయంలోనూ ఈ చర్యలే తీసుకున్నారు. మ్యాచ్ రిఫరీ షాహీన్ అఫ్రిదిపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అతని మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం కూడా ఉంది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌ను మెక్‌స్వీనీ పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో 2.4 ఓవర్లు వేసిన షాహిన్ షా అఫ్రిది.. 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 4 ఫోర్లతో పాటు 2 సిక్స్‌లు, 2 వైడ్స్, 3 నోబాల్స్ ఉన్నాయి. బీబీఎల్ అరంగేట్రంలోనే సస్పెన్షన్‌కు గురైన షాహిన్ షా అఫ్రిది‌పై సోషల్ మీడియా వేదికగా జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. పాపం.. పాక్ ప్రీమియర్ బౌలర్‌కు ఎంత గతిపట్టే అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ సీఫెర్ట్(56 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102) సెంచరీతో చెలరేగగా.. ఓలివర్ పీక్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Monday, December 15, 2025, 16:35 [IST]
Other articles published on Dec 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+