Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇప్పటికీ అయితే నేనే కెప్టెన్.. బాబర్ ఆజామ్ కాదు: షాహీన్ అఫ్రిది

పాకిస్థాన్ వన్డే టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి బాబర్ ఆజామ్‌కు అప్పగిస్తారని జరుగుతున్న ప్రచారంపై వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిది స్పందించాడు. ప్రస్తుతానికి తానే కెప్టెన్ అని బదులిచ్చాడు. పాకిస్థాన్ నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026 టోర్నీ నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్సీ మార్పు గురించి ప్రశ్నించగా షాహీన్ అఫ్రిది ఒకే ఒక్క మాటతో బదులిచ్చాడు. 'ప్రస్తుతానికి నేను పాకిస్థాన్ కెప్టెన్'అని స్పష్టం చేశాడు. మరో మాట కూడా అనలేదు.

ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది: బాబర్ ఆజామ్

ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది: బాబర్ ఆజామ్

ఇటీవలే పాకిస్థాన్ టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు అందుకున్న బాబర్ ఆజామ్.. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశాడు. సుదీర్ఘ కాలం తర్వాత విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ విజయాన్నందించాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జట్టు మళ్లీ గాడిన పడాలంటే బాబర్ ఆజామ్‌కు మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతలు అప్పగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బాబర్ ఆజామ్‌కు మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతలు అప్పగిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాహీన్ అఫ్రిది వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Shaheen Afridi Breaks Silence on Babar Azam Captaincy Rumours Ahead of 2027 World Cup

ఇప్పుడు నేనే కెప్టెన్..

పాకిస్థాన్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మైక్ హెస్సన్, సెలెక్టర్ అకిబ్ జావేద్‌ల సపోర్ట్ కూడా బాబర్ ఆజామ్‌కు ఉందా? అని ప్రశ్నించగా.. ఓ చిరు నవ్వు నవ్వి 'ఇప్పటికైతే నేనే సారథి'అని స్పష్టం చేశాడు. టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు తిరిగి అందుకునే సమయంలోనే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇవ్వాలనే షరతు విధించినట్లు తెలుస్తోంది.

వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో మెరుగైన ఫలితాలు సాధిస్తే.. తిరిగి బాబర్ ఆజామ్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమిస్తామని ఇద్దరు సెలెక్టర్లు హామీ ఇచ్చినట్లు సమాచారం. మహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం, 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్‌ చేతిలో సిరీస్ ఓడిపోవడంతో అతనిపై వేటు పడింది. గతేడాది అక్టోబర్‌లో షాహీన్ అఫ్రిదికి వన్డే సారథ్య బాధ్యతలు దక్కాయి.

షాహీన్ అఫ్రిది సారథ్యంలో లాహోర్ ఖలందర్స్ జట్టు గత ఐదు పీఎస్‌ఎల్ సీజన్లలో మూడు సార్లు విజేతగా నిలిచింది. దాంతో వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిదిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ వరకు అతడే కెప్టెన్‌గా కొనసాగుతాడని భావిస్తున్నప్పటికీ.. పాక్ క్రికెట్‌లో తరచూ జరిగే మార్పుల దృష్ట్యా అతనికి కూడా గ్యారెంటీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

IND vs SL వామప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో గెలిపించిన సిరాజ్!

Also Read

IND vs SL వామప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో గెలిపించిన సిరాజ్!

బాబర్ ఆజామ్ కూడా తాత్కలిక సారథిగానే..

బాబర్ అజామ్‌కు కూడా టెస్ట్ కెప్టెన్సీ తాత్కలిక ప్రాతిపదకనే ఇచ్చారు. కేవలం వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనలకు మాత్రమే అతన్ని కెప్టెన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో, వచ్చే ప్రపంచకప్‌లో బాబర్ అజమే పాకిస్థాన్ కెప్టెన్‌గా ఉంటాడని మాజీ బ్యాటర్ బాసిత్ అలీ ఇటీవల జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా పాకిస్థాన్ బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది. స్వదేశంలో శ్రీలంక, ఇంగ్లండ్‌తో ట్రై-సిరీస్, ఆ తర్వాత జింబాబ్వే, ఐర్లాండ్‌తో మరో ట్రై-సిరీస్, ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లలో ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్సీ భవితవ్యం తేలనుంది.

Story first published: Tuesday, August 11, 2026, 14:55 [IST]
Other articles published on Aug 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+