Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shah Rukh Khan: కేకేఆర్ గెలిస్తే.. ఆ కప్‌‌లో కాఫీ తాగుతా!

Shah Rukh Khans Old Tweet Revealing His Plans if KKR Won IPL 2021

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌ తుది దశకు చేరుకుంది. మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మెగా ఫైనల్ ప్రారంభం కానుంది. అయితే ఈ టైటిల్ ఫైట్ నేపథ్యంలో బాలీవుడ్ హీరో, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ చేసిన ఓ పాత ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ సీజన్‌లో కోల్‌కతా విజయం సాధిస్తే.. ఆ కప్‌లోనే కాఫీ తాగుతానని షారుఖ్‌ ఖాన్‌ గతంలో ట్విటర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కేకేఆర్ ఫైనల్ చేరడంతో ఈ ట్వీట్ మళ్లీ తెరపైకి వచ్చింది. భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్ సందర్భంగా.. షారూఖ్ ట్విటర్‌ వేదికగా 'ఆస్క్‌ఎస్‌ఆర్కే' పేరిట ఓ సెషన్‌ నిర్వహించాడు.

కప్ గెలిస్తే.. కాఫీ తాగుతా..

ఈ చిట్ చాట్ సెషన్‌లో ఓ అభిమాని.. ఈ సారి కోల్‌కతా కప్ గెలుస్తుందా..? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా.. 'గెలుస్తుందనే అనుకుంటున్నా.. ఒకవేళ కోల్‌కతా కప్‌ గెలిస్తే ఆ కప్‌లోనే కాఫీ తాగుతాను' అని షారుఖ్‌ ఖాన్‌ సమాధానం ఇచ్చాడు. గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా జట్టు 2012, 2014 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆ జట్టు ఐపీఎల్‌ ఫైనల్‌కి చేరింది. మరోవైపు ఎనిమిది సార్లు ఫైనల్‌ ఆడి మూడుసార్లు ట్రోఫీ గెలుచుకున్న చెన్నై జట్టు.. మరో కప్‌ సాధించాలనే జోష్‌తో ఉంది. హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్‌లో.. విజేతగా నిలిచేదెవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

సీఎస్‌కేదే ఆధిపత్యం..

సీఎస్‌కేదే ఆధిపత్యం..

తొమ్మిదిసార్లు ఫైనల్‌ చేరిన సీఎస్‌కే నాలుగోసారి కప్‌ కొట్టాలని భావిస్తుండగా... ఓటములతో ఇంటిదారి పడుతుంది అనుకున్న కేకేఆర్‌ ఫైనల్‌ చేరి మూడోసారి చాంపియన్‌గా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. నేటి మ్యాచ్‌ ప్రధానంగా చెన్నై బ్యాటింగ్‌కు, కోల్‌కతా బౌలింగ్‌కు మధ్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో సీఎస్‌కే- కేకేఆర్‌ 25సార్లు ముఖాముఖి తలపడగా...చెన్నై 16 సార్లు, కోల్‌కతా 8 సార్లు గెలిచాయి. ఇరు జట్లు తొలిసారిగా దుబాయ్‌ వేదికగా ఫైనల్‌లో తలపడబోతున్నాయి.

టాస్ గెలిస్తే..

టాస్ గెలిస్తే..

ఈ పిచ్‌పై జరిగిన 105 టీ20 మ్యాచులలో మొదటి బ్యాటింగ్ చేసినవారు 41 విజయాలు సాధించగా... లక్ష్యాన్ని చేధనకు దిగిన టీం 63 విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లోనూ టాస్‌ కీలకం కానుంది. స్టేడియం చరిత్ర ప్రకారం... ఒకవేళ ధోనీ టాస్‌ గెలిస్తే.. మరోసారి ఫీల్డింగ్‌ ఎంచుకుంటాడా.. లేదంటే కేకేఆర్‌ కు ఆ అవకాశం వస్తుందా... లేదంటే సెంటిమెంట్‌ను తిరగరాస్తూ అద్భుతాలేమైనా జరుగుతాయా లేదా అన్నది చూడాలంటే మ్యాచ్ ఫలితం తేలాల్సిందే.

Story first published: Friday, October 15, 2021, 18:51 [IST]
Other articles published on Oct 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+