Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shafali Verma స్టంపౌట్ వివాదం.. ఎల్ఈడీ బెయిల్స్ లేకపోవడంపై అభిమానుల అసహనం!

India Women vs England Women: Shafali Vermas Dismissal Sparks Debate Over Lack Of LED Bails In Womens Cricket

టాంటన్: ఇంగ్లండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల టీమ్ ఓపెనర్ షెఫాలి వర్మ ఔటైన విధానంపై వివాదం రాజుకుంటుంది. ఫస్ట్ వన్డేలో విఫలమైన షెఫాలి.. రెండో వన్డేలో మాత్రం అద్భుతంగా ఆడింది. 55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసిన ఈ చిచ్చర పిడుగు.. కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేసేలా కనిపించింది.

కానీ జట్టు స్కోర్ 77 రన్స్ వద్ద అనూహ్యంగా స్టంపౌటై పెవిలియన్ చేరింది. ప్రస్తుతం ఈ స్టంప్ ఔట్ అయిన విధానంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. అంతేకాకుండా మహిళా క్రికెట్‌లో ఎల్‌ఈడీ బెయిల్స్ వాడకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుంది.

అసలేం జరిగిందంటే..?

ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫియా వేసిన 17 ఓవర్ నాలుగో బంతిని లేట్ కట్ ఆడబోయిన ఫెఫాలి మూల్యం చెల్లించుకుంది. ఫెఫాలి పదే పదే క్రీజు బయటకు వచ్చి ఆడటాన్ని పసిగట్టిన సోఫియా.. లెంగ్త్‌ను మార్చుకొని తెలివిగా బంతిని వేసింది. దాంతో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఫెఫాలి.. ఆఖరి క్షణంలో షెఫాలి వర్మ లేట్ కట్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ.. బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వికెట్ కీపర్ ఎక్లెస్టోన్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో.. రెప్పపాటులో బెయిల్స్ ఎగరగొట్టిన ఎక్లెస్టోన్.. స్టంపౌట్ కోసం అప్పీల్ చేసింది.

ఎల్‌ఈడీ బెయిల్స్ లేక..

ఎల్‌ఈడీ బెయిల్స్ లేక..

బ్యాట్‌కు బంతి మిస్ అవడంతో.. స్టంపౌట్ నుంచి తప్పించుకునేందుకు షెఫాలి వర్మ వేగంగా తన బ్యాక్ ఫుట్‌ని క్రీజులో ఉంచే ప్రయత్నం చేసింది. కానీ.. భిన్న కోణాల్లో రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. సందేహాస్పదరీతిలో షెఫాలి వర్మను ఔట్‌గా ప్రకటించాడు. ఒకవేళ స్టంప్‌లపై ఎల్‌ఈడీ బెయిల్స్ ఉండి ఉంటే..? స్టంపౌట్‌పై మరింత క్లారిటీ వచ్చేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహిళల క్రికెట్‌లో ఎల్‌ఈడీ బెయిల్స్‌ను వినియోగించడం లేదు. అయితే దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఈడీ బెయిల్స్ ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ లీసా స్టాలెకర్ సైతం అసహనం వ్యక్తం చేసింది. గత రెండు వన్డేల్లో ఇలా జరగడం రెంసారి తెలిపింది.

మిథాలీ మెరిసినా..

మిథాలీ మెరిసినా..

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్(92 బంతుల్లో 7 ఫోర్లతో 59) రాణించినా.. భారత మహిళలకు ఓటమి తప్పలేదు. బుధవారం అర్దరాత్రి దాటక ముగిసిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్ మహిళలు 5 వికెట్లతో ఘన విజయం సాధించారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు స్మృతి మంధాన(22), షెఫాలీ వర్మ(44) శుభారంభం అందించినా.. మిగతా బ్యాటర్లు దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. ఓవైపు నుంచి మిథాలీ రాజ్ పోరాడినా.. మరోవైపు ఆమెకు ఎవరూ అండగా నిలవలేదు.

క్రేట్ క్రాస్..

క్రేట్ క్రాస్..

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి 15 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఆ జట్టులో ఓపెనర్ లారెన్ విన్‌ఫీల్డ్ హిల్(42), లోయరార్డర్ బ్యాటర్లు సోఫియా డంక్లీ(73 నాటౌట్), కేతరిన్ బ్రంట్(33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. జూలన్ గోస్వామి, శిఖా పాండే, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. భారత్ పతనాన్ని శాసించిన కేట్ క్రాస్(5/34)‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Thursday, July 1, 2021, 17:37 [IST]
Other articles published on Jul 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+