For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళల అండర్ 19 ప్రపంచకప్ కెప్టెన్‌గా షెఫాలీ వర్మ.. జట్టులో తెలంగాణ అమ్మాయికి చోటు!

Shafali Verma to lead India at Under-19 Womens T20 World Cup, Telangana player trisha also picked

న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల అండర్ 19 ప్రపంచకప్‌ అరంగేట్ర సీజన్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను సోమవారం వెల్లడించింది. టీమిండియా యువ బ్యాటర్‌ షెఫాలీ వర్మ‌ను అండర్‌-19 మహిళల జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇప్పటికే షెఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్ర చేసి టీ20 ప్రపంచకప్ కూడా ఆడేసింది. అయితే ఆమె వయసు ఇంకా 19 ఏళ్లు పూర్తి కాకపోవడంతో బీసీసీఐ అండర్ 19 జట్టుకు ఎంపిక చేసింది.

షెఫాలీ మాదిరే సీనియర్ వికెట్ కీపర్ రిచా గోష్‌ సైతం జట్టులో స్థానం దక్కించుకుంది. వైస్ కెప్టెన్‌గా శ్వేతా సెహ్రావత్‌ ఎంపికవ్వగా.. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు అవకాశం దక్కింది. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా తొలి ఎడిషన్‌లో 16 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరి 14 నుంచి 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. గ్రూప్‌- డీలో టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్‌ ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి టాప్‌ 3లో నిలిచిన జట్లు సూపర్‌ 6 రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తాయి. ప్రతి గ్రూపు నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జనవరి 27న జరగనున్న సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.

ఈ మెగా టోర్నీకి ముందు సౌతాఫ్రికా వేదికగా ఆ జట్టు అండర్-19 జట్టుతో షెఫాలీ సేన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది.

సౌతాఫ్రికాతో టీ20కి ఎంపికైన జట్టు:
షెఫాలీ వర్మ(కెప్టెన్‌), శ్వేతా సెహ్రావత్‌(వైస్‌ కెప్టెన్‌), రిచా ఘోష్‌(వికెట్‌ కీపర్‌), గొంగడి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెహ్దియా, హర్లీ గాలా, హర్షితా బసు(వికెట్‌ కీపర్‌), సోనం యాదవ్‌, మన్నత్‌ కశ్యప్‌, అర్చనా దేవి, పర్షవి చోప్రా, టిటాస్‌ సధు, ఫలక్‌ నాజ్‌, షబ్నమ్‌ ఎండీ, షికా, నజ్లా, యశశ్రీ.

అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ జట్టు:
షెఫాలి వర్మ(కెప్టెన్‌), శ్వేతా సెహ్రావత్‌(వైస్‌ కెప్టెన్‌), రిచా ఘోష్‌(వికెట్‌ కీపర్‌), గొంగడి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెహ్దియా, హర్లీ గాలా, హర్షితా బసు(వికెట్‌ కీపర్‌), సోనమ్‌ యాదవ్‌, మన్నత్‌ కశ్యప్‌, అర్చనా దేవి, పర్షవి చోప్రా, టిటాస్‌ సధు, ఫలక్‌ నాజ్‌, షబ్నమ్‌ ఎండీ.

Story first published: Monday, December 5, 2022, 20:10 [IST]
Other articles published on Dec 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+