For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: ఫెఫాలీ వర్మ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం

శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం వైజాగ్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ సమష్టిగా చెలరేగిన భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో తెలుగు తేజం శ్రీచరణి (2/23) నిప్పులు చెరిగితే.. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ(34 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 69 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), హర్షిత్ సమరవిక్రమా(32 బంతుల్లో 4 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా.. హాసిని పెరారా(28 బంతుల్లో 3 ఫోర్లతో 22) కాస్త ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో శ్రీచరణితో పాటు వైష్ణవి శర్మ(2/32) రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో వికెట్ తీసారు.

Shafali Verma s Unbeaten 69 Powers India Women to 7-Wicket Win Over Sri Lanka

అనంతరం భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి సునాయాస విజయాన్నందుకుంది. షెఫాలీ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26) పర్వాలేదనిపించింది. స్మృతి మంధాన(14), హర్మన్‌ప్రీత్ కౌర్(10) నిరాశపర్చగా.. రిచా ఘోష్(1 నాటౌట్) సాయంతో షెఫాలీ వర్మ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. భారత సమష్టి ప్రదర్శనతో ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా ముగిసింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 శుక్రవారం తిరువనంతపురం వేదికగా జరగనుంది.

Story first published: Tuesday, December 23, 2025, 21:54 [IST]
Other articles published on Dec 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+