'ఆటగాళ్లదా.. సెలక్టర్లదా ..నిజమెవరిది...?'

న్యూ ఢిల్లీ: వెస్టిండీస్‌తో ఆడేందుకు టీమిండియాలో తమ పేరు లేదనే విషయంపై భారత క్రికెటర్లు, సెలక్టర్ల మధ్య వివాదం జరుగుతూనే ఉంది. పదిరోజుల నుంచి విమర్శ, ప్రతి విమర్శలతో కూడిన ఈ తంతులో నిజాలు తేలడంలేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే తమపై వేటు వేస్తున్నారని ఆటగాళ్లు ఆరోపిస్తుండగా.. వారికి కచ్చితమైన కారణం చెప్పిన తర్వాత జట్టు నుంచి తొలగిస్తున్నామని సెలక్టర్లు చెప్పుకొస్తున్నారు.

ఇప్పటికీ స్పష్టత రావడం లేదు
ఇలా.. ఎవరు నిజం చెప్తున్నారు..? అనే దానిపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. కొద్దిరోజులుగా ఈ వివాదం నడుస్తున్నా.. ఇప్పటికీ ఆటగాళ్లు, సెలక్టర్ల మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ను తొలగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నించకపోవడం విమర్శలకి తావిస్తోంది.
ఆస్ట్రేలియాకి బదులు న్యూజిలాండ్ జెండా ఎగరేసి..

ఆటగాళ్లతో హుందాగా వ్యవహరించలేదని
ఇంగ్లాండ్ గడ్డపై గత నెల ముగిసిన టెస్టు సిరీస్ మధ్యలోనే సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఆ తర్వాత గత వారం వెస్టిండీస్‌తో ఆరంభమైన టెస్టు సిరీస్‌కి కరుణ్ నాయర్, శిఖర్ ధావన్‌లను ఎంపిక చేయకుండా వేటు వేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆటగాళ్లతో సెలక్టర్లు హుందాగా వ్యవహరించలేదని.. తమపై వేటు వేస్తున్నట్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదంటూ తొలుత కరుణ్ నాయర్, ఆ తర్వాత మురళీ విజయ్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుసుకునేందుకు కూడా బీసీసీఐ ఇప్పటి వరకు
వీరికి సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా మద్దతుగా నిలిచాడు. కానీ.. తాము కరుణ్, విజయ్‌తో వ్యక్తిగతంగా మాట్లాడి.. కారణం చెప్పిన తర్వాతే జట్టు నుంచి తప్పించామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాలుగు రోజుల ముందు వివరణ ఇచ్చారు. దీంతో.. ఎవరు నిజం చెప్తున్నారో..? ఎవరు అబద్దం చెప్తున్నారో..? కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా బీసీసీఐ ఇప్పటి వరకు చేయలేదు.

గ్యాప్‌ని తొలగించేందుకు ఎలాంటి చొరవా తీసుకోలేదు
‘సెలక్టర్లు లేదా ఆటగాళ్లు ఎవరో ఒక్కరు మాత్రమే ఇక్కడ నిజం చెప్తున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ని తొలగించేందుకు బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చొరవా తీసుకోలేదు. కెప్టెన్ లేదా కోచ్‌తో మాట్లాడటం లేక ఆటగాళ్లతో, సెలక్టర్లతో కలిసి చర్చించి ఉండాల్సింది. అలా చేసి ఉంటే ఇప్పటికే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications