ధోనికి బౌలింగ్: ఆ బౌలర్ల కళ్లలో భయాన్ని చూశానంటున్న భజ్జీ

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అద్భుతమైన ఆటతీరుతో చెన్నై జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
రెండేళ్ల విరామం అనంతరం పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ధోని నాయకత్వంలో అద్భుత విజయాలను నమోదు చేస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‌లాడి అందులో ఏడింట విజయం సాధించి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | చెన్నై సూపర్ కింగ్స్

అద్భుతమైన ఫామ్‌లో ధోని
ఐపీఎల్ 11వ సీజన్‌కు ముందు టీమిండియా ఆడిన ధోని వరుసగా విఫలమవుతూ వచ్చాడు. దీంతో ధోని ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు ధోని తనదైన శైలిలో సమాధానమిస్తూ, ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.

ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన భజ్జీ
తాజాగా ఈ సీజన్‌లో ధోని బ్యాటింగ్ ప్రదర్శనపై ఆ జట్టు బౌలర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనికి బౌలింగ్ చేయాలంటే బౌలర్లు భయపడతారని వెల్లడించాడు. ధోనికి బౌలింగ్ వేసే బౌలర్ల కళ్లలో భయం కలుగుతుందని, వారి కళ్లలో భయాన్ని తాను స్వయంగా చూశానని భజ్జీ తెలిపాడు.

ధోనిలా మరే క్రికెటర్ బంతిని ఎదుర్కొనడం లేదు
క్రీజులో ధోని చాలా ప్రశాంతంగా ఆడుతున్నాడని, ధోనిలా మరే క్రికెటర్ బంతిని ఎదుర్కొనడం లేదని ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో అభిమానులు మునుపటి ధోనిని చూడటం చాలా సంతోషంగా ఉందని హార్భజన్ సింగ్ అన్నాడు.

టోర్నీలో చెన్నై తదుపరి మ్యాచ్ రాజస్థాన్‌తో
టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్‌లో మే 11(శుక్రవారం) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications