న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాప్ లేచి పోతోన్న భారత్-వెస్టిండీస్ టిక్కెట్ల ధరలు

India vs Windies 2018 : Second Test Tickets Sale Starting From Wednesday
second test tickets sale starting from wednesday

న్యూ ఢిల్లీ: భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఉప్పల్‌ స్టేడియంలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ప్రేక్షకులకు అమ్మకానికి ఉంచారు. నేటి (బుధవారం) నుంచి ఈ టికెట్లు ఆన్‌లైన్‌ (eventsnow.com)తో పాటు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో లభిస్తాయి. ఒక రోజు ఆటకు సంబంధించి కనిష్ట ధర రూ. 100 కాగా, గరిష్టంగా రూ.1000గా నిర్ణయించారు.

300 నుంచి రూ. 3000 వరకు విలువైన టికెట్లు

300 నుంచి రూ. 3000 వరకు విలువైన టికెట్లు

ఐదు రోజుల కోసం ఒకే సారి సీజన్‌ టికెట్‌ కొనుక్కుంటే రూ. 300 నుంచి రూ. 3000 వరకు విలువ గల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం కేవలం 10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాస్‌లుగా నిర్ణయించారు. దాంతో దాదాపు 39 వేల సామర్థ్యం గల రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సుమారు 35 వేల వరకు టికెట్లు ప్రేక్షకులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.

'కోహ్లీ తప్ప ఎంటర్‌టైనర్సే కనిపించడం లేదు'

4వేల మంది స్కూల్ విద్యార్థులకు

4వేల మంది స్కూల్ విద్యార్థులకు

ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం కనిపస్తుంది. దీంతోపాటు టెస్ట్ జరిగే ప్రతిరోజూ నాలుగువేల మంది స్కూల్ విద్యార్థులకు ఉచితప్రవేశం కల్పిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించిన నేపథ్యంలో స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్‌శాఖ ప్రత్యేక నజర్ పెట్టింది. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పరిశీలించారు.

1500 మంది సిబ్బంది.. 100 సీసీ కెమెరాల ఏర్పాటు

1500 మంది సిబ్బంది.. 100 సీసీ కెమెరాల ఏర్పాటు

మ్యాచ్ భద్రత కోసం 1500 మంది సిబ్బందిని మొహరించనున్నారు. వీరిలో రక్షణ సిబ్బంది 250, ట్రాఫిక్ పోలీసులు 150, సివిల్ పోలీసులు 519, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది నలుగురితోపాటు ఆక్టోపస్ విభాగాలకు చెందిన నలుగురు ఈ మ్యాచ్‌కోసం పని చేయబోతున్నట్లు ఆయన వివరించారు. స్టేడియం చుట్టూ, పార్కింగ్ స్థలాల్లో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మ్యాచ్‌కు తరలివచ్చే అభిమానుల కోసం 16 పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేసినట్లు భగవత్ తెలిపారు.

టెస్టులోనూ భారత్ ఘన విజయం

టెస్టులోనూ భారత్ ఘన విజయం

భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరుగనున్న రెండోటెస్ట్ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెస్టులోనూ భారత్ ఘన విజయం సాధించే అవకాశం ఉంది.

1
44265
Story first published: Wednesday, October 10, 2018, 11:54 [IST]
Other articles published on Oct 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X