Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జింబాబ్వేపై సెంచరీ చేసినా విరాట్ కోహ్లీకి ఒరిగేదేం లేదు: కివీస్ మాజీ క్రికెటర్

Scott Styris says Virat Kohli might score cheap hundred in Zimbabwe but that won’t change things

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనలో కోహ్లీ ఆడటం వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం లేదని, సెంచరీ చేసినా ఒరిగేదేం లేదన్నాడు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లీ.. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్నాడు.

ఫ్యామిలీతో కలిసి యూకేలో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలో అతను టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఆసియా కప్ 2022లో రాణించడంపైనే కోహ్లీ భవితవ్యం ఆధారపడి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఆసియా కప్‌కు ముందే కోహ్లీని ఫామ్‌లోకి తీసుకురావాలని బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రచిస్తుంది. జింబాబ్వే పర్యటనకు పంపిస్తే కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని సెంచరీ కూడా కొడతాడని భావిస్తోంది.

విశ్రాంతి తీసుకోవడం బెటర్..

విశ్రాంతి తీసుకోవడం బెటర్..

అయితే ఈ ఆలోచన తీరును స్కాట్‌ స్టైరిస్‌ తప్పుబట్టాడు. దానివల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని కొట్టిపడేశాడు.'విరాట్ కోహ్లీకి కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్ శర్మ అండగా ఉండటం మంచిదే. అదేవిధంగా విశ్రాంతి తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. అయితే జింబాబ్వేతో వన్డేలు ఆడేందుకు విరాట్ కోహ్లీని పంపించాలని కొందరు చెబుతున్నారు. జింబాబ్వేపై కోహ్లీ అలవోకగా సెంచరీ కొట్టగలడు. కానీ అతనికి పెద్దగా ప్రయోజనం ఉండదు. జింబాబ్వేను తక్కువ చేయడం కాదు. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే జింబాబ్వేతో ఆడాల్సిన అవసరం లేదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నేను చెబుతా'అని స్టైరిస్‌ సూచించాడు.

క్లారిటీ ఇవ్వాలి..

క్లారిటీ ఇవ్వాలి..

టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమయ్యేలోపు పూర్తి సన్నద్ధంగా ఉండేలా జట్టు యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని టీమిండియా మాజీ ఆటగాడు సబా కరీం తెలిపాడు. అదేక్రమంలో విరాట్ కోహ్లీ విలువేంటో రోహిత్, రాహుల్ ద్రవిడ్‌కు తెలుసునని చెప్పాడు. ''ప్రపంచకప్‌ జట్టులోకి విరాట్‌ను తీసుకునే ఆలోచన యాజమాన్యంతోపాటు సెలెక్టర్లకు ఉందో లేదో స్పష్టతనివ్వాలి. జట్టు విజయానికి కోహ్లీ అవసరమని భావించిన తర్వాత.. విరాట్ ఫామ్‌లోకి రావడానికి నా దగ్గర ఓ మార్గం ఉంది.'అని కరీం చెప్పుకొచ్చాడు.

ఆడాలని ఉంటే పంపించండి..

ఆడాలని ఉంటే పంపించండి..

'జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడాలని నేను ఆదేశించను. అక్కడ ఆడితేనే ప్రపంచకప్‌కు పరిగణనలోకి తీసుకుంటానని చెప్పను. ఆడాలని భావిస్తే వెళ్లు ఆడు. లేకపోతే విరామం తీసుకుంటానని చెబితే అలానే చేయ్‌. ఆసియా కప్‌ వరకు విశ్రాంతి తీసుకో' అని కోహ్లీకి చెబుతా'' అని మాజీ సెలెక్టర్‌ సబా కరీం వ్యాఖ్యానించాడు. ఒకవేళ జింబాబ్వేతో ఆడినప్పుడూ విఫలమైతే కోహ్లీని జట్టు నుంచి తప్పించడం పెద్ద తప్పిదమవుతుందని కరీం అభిప్రాయపడ్డాడు.

Story first published: Friday, July 29, 2022, 12:43 [IST]
Other articles published on Jul 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+