బుద్ధి లేనోడే గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.10 కోట్లు వెచ్చిస్తాడు: స్కాట్ స్టైరిస్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 వేలంలో బుద్ధి ఉన్నోడు ఎవడూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ కోసం మళ్లీ రూ. 10 కోట్లు ఖర్చు చేయడని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ అన్నాడు. ఎవరైన మ్యాక్‌వెల్ కోసం అంత ధర వెచ్చిస్తే వారి తలలో రాళ్లున్నట్లేనని పేర్కొన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న స్టైరిస్.. ఐపీఎల్ 2021 వేలంలో మ్యాక్స్‌వెల్‌కు భారీ ధర పలికే అవకాశమే లేదన్నాడు. మ్యాక్సీకి మిలియన్ డాలర్లు ఖర్చు చేయడం దండుగని స్పష్టం చేశాడు.

వారి తలలో రాళ్లున్నట్లే..
'ఎవరైనా మ్యాక్సీకి మళ్లీ రూ.10 కోట్లుగానీ, అంతకు సమీపంగా చెల్లిస్తే వారి తలల్లో రాళ్లున్నట్లే. మ్యాక్సీ ఎంత మంచి ప్లేయరో మనందరికి తెలిసిందే. కానీ ఇక్కడ ప్రశ్న అది కాదు. అతనికి అపార నైపుణ్యం ఉంది. కానీ అతని టాలెంట్ మనం చూసిన మ్యాక్సీ వాస్తవ ప్రదర్శనలను మించిపోయింది.'అని స్టైరిస్ పేర్కొన్నాడు. అయితే ఫ్రాంచైజీలు మ్యాక్సీ అంతర్జాతీయ ప్రదర్శనలను చూసి వేలానికి వెళ్లొద్దని, ఐపీఎల్ పెర్ఫామెన్స్‌ను విశ్లేంచుకోవాలని ఈ కివీస్ మాజీ క్రికెటర్ సూచించాడు.

బేస్ ప్రైజ్ ఎక్కువ..
గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో అతను రాణించిందేం లేదన్నాడు. ఒకవేళ అతన్ని తీసుకోవాలనుకున్నా.. బేస్ ప్రైజ్ కంటే ఎక్కువగా చెల్లించవద్దన్నాడు. 'మ్యాక్సీ కోసం పోటీ పడే ఫ్రాంచైజీలున్నాయి. కానీ వారు అతని బేస్ ప్రైజ్ కంటే ఎక్కువ చెల్లించకూడదు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడని అతనిపై భారీగా వెచ్చిస్తే అది మీ వృథా ప్రాయాసే. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించి మంచి ఫామ్‌లో ఉన్నా ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలు మరచిపోవద్దు'అని స్టైరిస్ హెచ్చరించాడు.

ఒక్క సిక్స్ కొట్టలేదు..
ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్సీ దారుణంగా విఫలమయ్యాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులే చేశాడు. ఒక్క సిక్స్ కూడా లేకుండా ఐపీఎల్‌ను ముగించాడు. దాంతో మ్యాక్సీని కింగ్స్ పంజాబ్ వదులుకుంది. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మ్యాక్సీ ఎవడూ తీసుకోడని చెప్పాడు. 'గ్లెన్ మాక్స్‌వెల్.. పంజాబ్ జట్టులో రూ.10 కోట్ల ఖరీదైన చీర్‌లీడర్. లీగ్‌లో గత కొన్ని సీజన్లుగా తన ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది.
అయితే ఈ సారి ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టి మరింత విఫలమయ్యాడు. ఇది అతనికి అత్యంత ఖరీదైన విహారయాత్రగా భావించవచ్చు.'అని సెహ్వాగ్ ఘాటుగా విమర్శించాడు. అంతేకాకుండా మ్యాక్సీ తాగితందాన చేయడానికే ఐపీఎల్ ఆడుతాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పంజాబ్ రిటెన్షన్ లిస్ట్..
రిటైన్ ప్లేయర్లు: కేఎల్ రాహుల్(కెప్టెన్), గేల్, పూరన్, షమీ, జోర్డాన్, మయాంక్, మన్‌దీప్ సింగ్, బిష్ణోయ్, ప్రభు సిమ్రాన్ సింగ్, దీపక్ హుడా, సర్ఫ్రాజ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, మురుగున్ అశ్విన్, ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్
వదులుకున్న ఆటగాళ్లు: గ్లేన్ మ్యాక్స్ వెల్, షెల్డన్ కాట్రెల్, కృష్ణప్ప గౌతమ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జిమ్మీ నీషమ్, హర్దస్ విల్‌జోయిన్, కరుణ్ నాయర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications