Scott Edwards: అలా చేసుంటే మరో సంచలనం నమోదయ్యేది!
Scott Edwards, CWC 2023: బ్యాటింగ్‌లో ఇంకొన్ని పరుగులతో పాటు ఫీల్డింగ్‌లో కాస్త చురుకుగా ఉంటే మరో సంచలన విజయాన్ని అందుకునేవాళ్లమని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఓడినా.. నెదర్లాండ్స్ అద్భుత పోరాటపటిమ కనబర్చింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన స్కాట్ ఎడ్వర్డ్స్.. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమిని శాసించిందన్నాడు.
'మేం ఆశించిన రీతిలో మా ఇన్నింగ్స్‌ను ఆరంభించలేదు. అయినా పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశాం. ఫీల్డింగ్‌లో తడబడటం మా విజయవకాశాలను దెబ్బతీసింది. పరుగులను నియంత్రించలేక బౌండరీలు సమర్పించుకున్నాం. మా బౌలర్లు ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆర్యన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనే తడబడ్డాం. సైబ్రాండ్, లోగాన్ 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. మా టాపార్డర్ మెరుగ్గా రాణించాల్సింది. ఇంకొన్ని పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది.'అని స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పుకొచ్చాడు.

గత మ్యాచ్‌లో పటిష్ట సౌతాఫ్రికాను మట్టికరిపించిన నెదర్లాండ్స్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(82 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 70), లోగన్ వాన్ బీక్(75 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.
91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన నెదర్లాండ్స్‌ను సైబ్రాండ్-వాన్ బీక్ 129 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(4/49), కాసున్ రజితా(4/50) నాలుగేసి వికెట్లతో సత్తా చాటగా.. మహీష్ తీక్షణ(1/44) ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసి గెలుపొందింది. సదీర సమర విక్రమా(107 బంతుల్లో 7 ఫోర్లతో 91 నాటౌట్) , పాతుమ్ నిస్సంక(52 బంతుల్లో 9 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. చరిత్ అసలంక(66 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 44), ధనంజయ డిసిల్వా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications