Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన స్కాట్ బోలాండ్!

ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ చరిత్ర సృష్టించాడు. పింక్ బాల్ టెస్ట్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బోలాండ్ ఈ ఫీట్ సాధించాడు. వరుస బంతుల్లో జస్టిన్ గ్రేవ్స్(11), షెమర్ జోసెఫ్(0), జోమెల్ వారికన్(0)లను పెవిలియన్ చేర్చాడు. బోలాండ్‌కు తోడుగా.. మిచెల్ స్టార్క్(6/9) నిప్పులు చెరగడంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 176 పరుగుల తేడాతో గెలుపొందింది. . ఈ గెలుపుతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(48), కామెరూన్ గ్రీన్(46) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం వెస్టిండీస్ 143 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ పేసర్లు స్కాట్ బోలాండ్(3/34), ప్యాట్ కమిన్స్ (2/24), జోష్ హజెల్ వుడ్(2/32) సమష్టిగా రాణించి విండీస్ పతనాన్ని శాసించారు. మిచెల్ స్టార్క్(1/32) ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. 83 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 121 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్(42) ఒక్కడే రాణించాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్(5/27) ఐదు వికెట్లతో రాణించాడు.

Scott Boland Records First-Ever Hat-Trick in Pink-Ball Test Cricket

అనంతరం వెస్టిండీస్.. మిచెల్ స్టార్క్(6/9), బోలాండ్(3/2) హ్యాట్రిక్ ధాటికి 27 పరుగులకు ఆలౌటైంది. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇది రెండో అత్యల్ప స్కోర్‌గా నిలిచిపోయింది. 1955లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ 26 పరుగులకే ఆలౌటైంది. టెస్ట్‌ల్లో హ్యాట్రిక్ తీసిన 10వ టెస్ట్ బౌలర్‌గా బోలాండ్ నిలిచాడు. డబ్ల్యూటసీ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన 6వ బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు జస్‌ప్రీత్ బుమ్రా, నసీమ్ షా, కేశవ్ మహరాజ్, గస్ అట్కిన్సన్, నోమన్ అలీ ఈ ఘనతను అందుకున్నారు.

Story first published: Tuesday, July 15, 2025, 14:37 [IST]
Other articles published on Jul 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+