టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి దుమ్మురేపాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా..భారత సెలెక్టర్లు పట్టించుకోపోయినా.. ఏ మాత్రం నిరాశ చెందని సర్ఫరాజ్ తన బ్యాటింగ్‌తోనే ప్రశ్నలు సంధించాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025-26 రెండో దశ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. హైదరాబాద్‌తో శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో 206 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.
219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 227 పరుగులు చేశాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదే తొలి శతకం కాగా.. ఓవరాల్‌గా 17వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. అతనికి ఇది ఐదో డబుల్ సెంచరీ. ఈ విధ్వంసకర డబుల్ సెంచరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. 2019-20 సీజన్ తర్వాత అత్యధిక ఫస్ట్ క్లాస్ సెంచరీలు బాదిన మూడో బ్యాటర్‌గా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు. అనుస్టప్ ముజుందార్, అమన్‌దీప్ ఖారేలు మాత్రమే అతని కంటే ఎక్కువ సెంచరీలు సాధించారు.

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను కూడా సర్ఫరాజ్ ఖాన్ చితక్కొట్టాడు. అతని బౌలింగ్‌లో 39 బంతులాడి 45 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ ధాటికి ఈ మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 560 పరుగుల భారీ స్కోర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు ముంబై కెప్టెన్ సిద్దేష్ లాడ్(179 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 104) సెంచరీతో చెలరేగాడు.
సువేద్ పర్కార్(98 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి(4/107) నాలుగు వికెట్లు తీయగా.. రోహిత్ రాయుడు(2/123) రెండు వికెట్లు తీసాడు. మహమ్మద్ సిరాజ్, నితిన్ సాయి యాదవ్, కొడిమెలా హిమతేజ తలో వికెట్ తీసారు. సర్ఫరాజ్ ధాటికి హైదరాబాద్ బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా సర్ఫరాజ్ ఖాన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో ముంబై తరఫున 6 ఇన్నింగ్స్‌లు ఆడి 303 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయినా సర్ఫరాజ్ ఖాన్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవకాశం లేకపోతే.. కనీసం టెస్ట్ క్రికెట్‌లోనైనా ఎంపిక చేయాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.