Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే నా బలం.. ఆ పాక్ క్రికెటర్ అంటే ఇష్టం: సర్ఫరాజ్ ఖాన్

ఏ విషయానికైనా తేలికగా సంతృప్తి చెందకపోవడమే తన అసలు బలమని టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ ముంబై బ్యాటర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యాడు.

ఈ మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన సర్ఫరాజ్ ఖాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. 'చిన్నతనంలో మా నాన్న క్రికెట్ ఆడటం నేర్పించారు.

 Sarfaraz Khan says My dad said I play like Javed Miandad ahead of IND vs ENG 2nd Test

నేను అటాకింగ్ బ్యాటర్‌ను. దూకుడుగా ఆడటంతో తక్కువ పరుగులకే ఔటయ్యేవాడిని. ఇతర క్రికెటర్లు నా కంటే ఎక్కువ రన్స్ చేసినప్పుడు చాలా నిరాశకు గురయ్యేవాణ్ని. సెలెక్షన్ ట్రయల్స్‌కు ముందు నాన్న టెర్రస్‌‌పై లేదంటే రోడ్డుపై నాకు బౌలింగ్ చేసేవారు. ఆ ప్రాక్టీస్ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది.

నేను ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి తిరిగి వచ్చినప్పుడు కెరీర్ ముగిసిపోతుందేమోనని భయపడ్డాను. కానీ మా నాన్న అండగా నిలిచాడు. అంత తేలికగా సంతృప్తి చెందకపోవడమే నా బలం. ప్రాక్టీస్‌లో రోజు నేను 500-600 బంతులు ఆడుతాను. మ్యాచ్‌లో కనీసం 200-300 బంతులు ఆడకపోతే నాకు ఏదోలా ఉంటుంది.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రాక్టీస్ చేయడం నాకు అలవాటుగా మారింది. ఐదు రోజుల క్రికెట్ ఆడాలంటే ఓపికతో రోజూ సాధన చేయాలి. నేను రోజంతా క్రికెట్ ఆడుతాను కాబట్టి పిచ్‌పై ఎక్కువ సేపు నిలబడగలను. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, సర్ వివియన్ రిచర్డ్స్, జావేద్ మియాందాద్ అంటే ఇష్టం. నేను మియాందాద్‌లా ఆడుతానని నాన్న తరుచూ చెబుతుంటారు.

నా ఐపీఎల్ అరంగేట్రంలోనే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాను. వారి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ధోనీ భాయ్ ముందు ఆడేందుకు ఎప్పుడూ ఇష్టపడుతాను.

ఆయన నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. ఆయన వ్యూహాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఐపీఎల్‌లో మహీ భాయ్ నాకు కీలక సలహా ఇచ్చాడు. 'నువ్వు బాగా ఆడుతున్నావు. నిన్ను నీవు నమ్ముకో.. నీ ఆటను నీవు ఆడు.'అని నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు.'అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 1, 2024, 21:22 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+