For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాప్‌రే.. 17 కిలోల బరువు తగ్గిన టీమిండియా స్టార్!

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టాడు. భారత టెస్ట్ టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ ఖాన్.. రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే అధిక బరువును తగ్గించుకునే పనిలో పడ్డాడు. కఠినమైన డైట్, వ్యాయమంతో రెండు నెలల వ్యవధిలోనే 17 కిలోల బరువు తగ్గాడు. బియ్యం బస్తాలా ఉండే సర్ఫరాజ్ ఖాన్.. కరెంట్ తీగలా సన్నగా మారాడు.

తాజాగా అతని బాడీ ట్రాన్స్‌ఫార్మెషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాప్‌రే.. 17 కిలోల బరువు తగ్గడమా? అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Sarfaraz Khan Reveals Body Transformation After Test Series Omission

కఠినమైన డైట్‌తో..

అన్నం, గోధుమలతో చేసిన ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టిన సర్పరాజ్ ఖాన్.. ఉడకబెట్టిన చికెన్, గుడ్లు, కూరగాయాలు మాత్రమే తీసుకున్నాడు. తక్కువ మోతాదులో ఆలివ్ ఆయిల్ ఉపయోగించాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు తమ కుటుంబం మొత్తం బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టిందని అతని తండ్రి నౌషద్ ఖాన్ ఇటీవల ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 'మా కుటుంబం మొత్తం బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టింది. సర్ఫరాజ్ ఖాన్ 6 వారాల్లో 9 కిలోల బరువు తగ్గాడు. అది అంత సులువైన పని కాదు. అతను ఇంకా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాడు.

సర్ఫరాజ్ ఖాన్, నేను ముంబై క్రికెట్ అసోసియేషన్ జిమ్‌లో క్రమం తప్పకుండా వ్యాయామం చేశాం. మేం అక్కడ ప్రతీ రోజు ఒక గంట పాటు వారానికి ఆరు రోజులు జిమ్ చేశాం. ఆ తర్వాత అక్కడి స్టేడియంలో కొంత వాకింగ్ చేశాను. సర్ఫరాజ్ ఖాన్ మాత్రం రన్నింగ్ చేసేవాడు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేసాం. నా చిన్న కొడుకు మొయిన్ ఖాన్ కూడా చాలా బరువు తగ్గాడు. మేం గోధుమ పిండి, బియ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టాం. ఉడికించిన చికెన్, గుడ్లు, కూరగాయాలను మాత్రమే తింటున్నాం. గ్రీన్ టీతో పాటు బ్లాక్ కాఫీ తాగుతున్నాం. తక్కువ మోతాదులో ఆలివ్ నూనెను ఉపయోగిస్తున్నాం.'అని నౌషద్ ఖాన్ చెప్పుకొచ్చారు.

ఇంగ్లండ్ పర్యటనలో రాణించినా..

ఆస్ట్రేలియా పర్యటనలో సర్ఫరాజ్ ఖాన్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. ఫిట్‌గా లేకపోవడంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. టెస్ట్ టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించిన సర్ఫరాజ్ ఖాన్ ముందుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో 150 పరుగులు చేసి సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్.. ఆ తర్వాత రెండు టెస్ట్‌ల్లో విఫలమయ్యాడు.

భారత్‌-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనలో సర్ఫరాజ్ ఖాన్ మెరుగైన ప్రదర్శన చేసినా భారత జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు అనధికారిక టెస్ట్‌ల్లో సర్ఫరాజ్ ఖాన్ 92, 101 పరుగులతో రాణించాడు. అయినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. భారత్ వేదికగా జరిగే టెస్ట్ సిరీస్‌ల్లో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ తీవ్రంగా నిరాశపరిచాడు.

Story first published: Monday, July 21, 2025, 15:12 [IST]
Other articles published on Jul 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+