Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం.. 17 కిలోలు తగ్గినా పట్టించుకోరా?

సౌతాఫ్రికాతో రెండు అనధికార టెస్ట్‌లకు ఎంపిక చేసిన భారత్-ఏ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు. ఇప్పటికే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్ శర్మ సారథ్యంలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఈ ముంబై క్రికెటర్ అదే జోరును అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కనబర్చాడు.

తన సెలెక్షన్‌కు ఫిట్‌నెస్ అడ్డొస్తుందని భావించి కఠినమైన డైట్, వ్యాయామంతో 17 కిలోల బరువు తగ్గాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికార టెస్ట్‌లో భారత్-ఏ తరఫున 91 పరుగులతో రాణించాడు. అయినా ఆ సిరీస్‌కు సర్పరాజ్‌ ఖాన్‌ను పట్టించుకోలేదు. ఓవర్‌సీస్ కాంబినేషన్‌లో భాగంగా సర్ఫరాజ్‌ ఖాన్‌కు అవకాశం దక్కలేదని అంతా భావించారు.

Sarfaraz Khan Omitted from India A Squad Fans Question Absence Despite Domestic Form

17 కిలోలు తగ్గినా పట్టించుకోరా?

ఆ తర్వాత గాయం కారణంగా వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమైనా.. పూర్తిగా కోలుకొని రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 42, 32 పరుగులు చేశాడు. అలాంటి సర్ఫరాజ్ ఖాన్‌ను భారత్-ఏ జట్టుకు ఎంపిక చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని సెలెక్టర్లను నెటిజన్లు నిలదీస్తున్నారు. మొన్నటి వరకు అతని ఫిట్‌నెస్ సాకుగా చూపించారని, ఇప్పుడేం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. 17 కిలోలు తగ్గినా పట్టించుకోరా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కెప్టెన్‌గా రిషభ్ పంత్

నవంబర్‌లో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టీమిండియా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సన్నాహకంగా సౌతాఫ్రికా-ఏ జట్టుతో భారత్ రెండు అనధికార టెస్ట్‌లు ఆడనుంది. ఈ సిరీస్ ఆడే భారత్-ఏ జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. గాయంతో భారత జట్టుకు దూరమైన రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

భారత అండర్ 19 కెప్టెన్ ఆయుష్ మాత్రే‌తో పాటు నారయణ జగదీషన్, రజత్ పటీదార్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, శరణ్ జైన్ తొలి అనధికార టెస్ట్‌కు ఎంపికవ్వగా.. , కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ రెండో అనధికార టెస్ట్ ఆడనున్నారు. రిషభ్ పంత్‌తో పాటు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, మానవ్ సుతార్, తనూష్ కొటియాన్ రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. సర్పరాజ్ ఖాన్ ఏం పాపం చేశాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

సౌతాఫ్రికా-ఏతో అనధికార టెస్ట్‌లు ఆడే భారత్-ఏ జట్లు:

తొలి అనధికార టెస్ట్ కోసం భారత్-ఏ జట్టు:

రిషభ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), ఆయుష్ మత్రే, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్-కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యష్ ఠాకూర్, ఆయుష్ బదోని, సరంశ్ జైన్.

రెండో అనధికార టెస్ట్ కోసం భారత్-ఏ జట్టు:

రిషభ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్-కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.

Story first published: Tuesday, October 21, 2025, 15:40 [IST]
Other articles published on Oct 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+