Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రైన టీమిండియా క్రికెటర్..!

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యాడు. అతని సతీమణి రోమానా జహూర్ సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకర విషయాన్ని సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బిడ్డను ఎత్తుకున్నఫొటోలను ఈ పోస్ట్‌కు జత చేశాడు. తండ్రైన సర్ఫరాజ్ ఖాన్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో శతకం సాధించిన సర్ఫరాజ్ ఖాన్‌.. తాజాగా తండ్రి అవ్వడంతో వారింట్లో సంతోషం రెట్టింపు అయ్యింది. గతేడాది ఆగస్టులో రోమానా జహూర్‌తో సర్ఫరాజ్ ఖాన్‌కు పెళ్లైంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

Sarfaraz Khan Becomes Father Of A Baby Boy Photos Goes Viral

రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో అతని సతీమణి రోమానా, తండ్రి నౌషద్ ఖాన్ పక్కనే ఉన్నారు. ఈ ఇద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు.

తాజాగా న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అనూహ్యంగా అవకాశాన్ని అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తనకే సాధ్యమైన అప్పర్ కట్, స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్‌తో పాటు ర్యాంప్ షాట్స్ రఫ్ఫాడించాడు.

వెనక్కి వంగి బౌన్సర్లను బౌండరీలకు తరలించిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఫిట్‌నెస్ లేదని ఇన్నాళ్లు అతన్ని పక్కనపెట్టిన వారికి ఈ షాట్స్ చెంపపెట్టు అయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

పుణె టెస్ట్‌లోనూ సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగనున్నాడు. తండ్రైన ఉత్సాహంలో అతను మరింత చెలరేగే అవకాశం ఉంది. గురువారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, October 22, 2024, 10:45 [IST]
Other articles published on Oct 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+