For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sarfaraz Khan:సారీ.. సన్నీ సార్.. మరోసారి అలా చేయను!

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌‌కు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. మరోసారి నిర్లక్ష్యపు షాట్లు ఆడనని మాటిచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

అరంగేట్ర సిరీస్‌లోనే మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసుకున్న సర్ఫరాజ్.. అదే జోరులో ఓ చెత్త షాట్‌కు వెనుదిరిగాడు. టీ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతినే కట్ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు.

Sarfaraz Khan apologizes to Sunil Gavaskar for Dharamsala blunder

క్రీజులో సెట్ అయిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఇలా చెత్త షాట్‌తో వెనుదిరగడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కామెంట్రీలోనే సర్ఫరాజ్ ఖాన్ చెత్త షాట్‌ను తప్పుబట్టాడు. అసలు కట్ షాట్ ఆడాల్సిన బంతే కాదని విమర్శించాడు. ఈ సందర్భంగా సర్ డాన్ బ్రాడ్‌మన్ చెప్పిన మాటలను గుర్తు చేశాడు.

'200 పరుగులు చేసిన తర్వాత కూడా ఎదుర్కొనే తర్వాత బంతిని 0 మీదే ఆడుతున్నట్లు భావించేవారు.'అని తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్ తొందరపాటుతో మూల్యం చెల్లించుకున్నాడని తెలిపాడు. అయితే గవాస్కర్ మందలింపునకు సర్ఫరాజ్ ఖాన్ బాధపడ్డాడని, ఆయనకు క్షమాపణలు కూడా చెప్పాడని ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ భాటియా తెలిపారు. ఈయన గవాస్కర్‌కు అత్యంత సన్నిహితుడు.

'సర్ఫరాజ్ ఖాన్‌కు సునీల్ గవాస్కర్ ఓ కీలక సలహా ఇచ్చాడు. షాట్ల ఎంపికపై హెచ్చరించాడు. దాదాపు 45 నిమిషాలతో పాటు అతనితో గవాస్కర్ మాట్లాడాడు. కానీ, టీ బ్రేక్ తర్వాత అలాంటి చెత్త షాట్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఔటవ్వడంతో గవాస్కర్ ఆగ్రహానికి లోనయ్యాడు. కామెంట్రీ సందర్భంగా సర్ఫరాజ్ ఆటతీరును తప్పుబట్టాడు. మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు సర్ఫరాజ్ నాతో మాట్లాడాడు.

'గవాస్కర్‌ సార్‌కు క్షమాపణలు చెబుతున్నా. నేను తప్పు చేశా. మరోసారి ఇలాంటి తప్పిదాలను పునరావృతం చేయను'అని సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు.'అని శ్యామ్ భాటియా చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, March 13, 2024, 22:25 [IST]
Other articles published on Mar 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+