కుర్బానీపై ట్వీట్.. వివాదంలో సర్ఫరాజ్ అహ్మద్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. పాకిస్థాన్ మెగా టోర్నీ ప్రపంచకప్‌లో లీగ్ దశ నుండే నిష్క్రమించడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. తాజాగా మరోసారి విమర్శలకు గురయ్యాడు. బక్రీద్ సందర్భంగా కుర్బానీ (జంతు వధ)పై సర్ఫరాజ్ ఓ వీడియోతో పాటు ఫొటోలను పోస్టు చేశాడు.
పొలార్డ్‌కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
'ఈ రోజు పశువుల బలిని సూచిస్తుంది. మేక, గొర్రె, ఒంటె, గేదెలు ఒక వ్యక్తి కోసం త్యాగం చేయాల్సిందే' అని బక్రీద్ సందర్భంగా ట్వీట్ చేసాడు. దీంతో ఆగ్రహించిన నెటిజన్లు సర్ఫరాజ్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. 'పెటా' నిర్వాహకులు ఏం చేస్తున్నారని? ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువులు, వాటి హక్కులను పరిరక్షించే దిశగా పెటా రంగంలోకి దిగాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రపంచకప్-2019లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశ నుండే నిష్క్రమించడంతో పాక్ జట్టును గాడిలో పెట్టేందుకు పీసీబీ పూనుకుంది. పాక్ క్రికెట్‌ను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్న నేపథ్యంలో.. హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్, చీఫ్ సెలెక్టర్ ఇంజామామ్-ఉల్-హక్ మరియు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు హాజరయ్యారు. గత నాలుగు సంవత్సరాలలో జట్టు ప్రదర్శనపై వివరణ ఇచ్చారు. పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశం నాలుగు గంటల పాటు కొనసాగింది.
హెడ్ కోచ్ మికీ ఆర్థర్ బోర్డుకు ఓ నివేదిక సమర్పించాడు. కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను మూడు ఫార్మాట్ల నుంచి తొలగించండి అని అందులో పేర్కొన్నాడని సమాచారం తెలుస్తోంది. సర్ఫరాజ్ స్థానంలో టెస్టుల్లో ఒకరినీ, పరిమిత ఓవర్లో మరొకరినీ కెప్టెన్‌లుగా ఎంపిక చేయాలని కోచ్ అభిప్రాయపడ్డాడట. ఇక తన పర్యవేక్షణలో పాక్ మంచి ప్రదర్శన చేసింది, మరో రెండేళ్లు తన పదవిని పొడిగించాలని ఆర్థర్ కోరాడట. అయితే కెప్టెన్, కోచ్ ఈ విషయంపై పీసీబీ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications