
పేలవ ఫామ్, ఫిట్‌నెస్:
విషయంలోకి వెళితే... 2019 వన్డే ప్రపంచకప్ సర్ఫరాజ్ జీవితంలో ఓ పీడకల. మెగా టోర్నీ అనంతరం అక్టోబరులో పేలవ ఫామ్, ఫిట్‌నెస్ కారణంగా కెప్టెన్సీతో పాటు జట్టులోనూ చోటు కోల్పోయాడు. ఆపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 2020-21 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను ప్రకటించగా.. మాజీ కెప్టెన్ క్యాటగిరీ 'బి'కి పడిపోయాడు. గతేడాది కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో సర్ఫరాజ్ క్యాటగిరీ 'ఏ' నుంచి 'బి'కి దిగజారింది. ఇక లాక్‌డౌన్ సమయంలోనూ ఇంట్లోనే ఫిట్‌నెస్ మెరుగుపర్చుకుని ఇంగ్లండ్ పర్యటనకి ఏమిపయ్యాడు.

రిజర్వ్ బెంచ్‌పైనే:
సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లండ్ పర్యటనకి ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. దాంతో సిరీస్ మొత్తం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైయ్యాడు. ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ ముగియగా.. రిజర్వ్ బెంచ్‌పై కూర్చున్న సర్ఫరాజ్ ఆవలింతలు తీస్తూ కెమెరాకి చిక్కాడు. దాంతో మూడు ఫార్మాట్లలోనూ ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పావంటూ సర్ఫరాజ్‌పై నెటిజన్లు జోక్‌ల వర్షం కురిపిస్తున్నారు.

రెండుసార్లు ఇంగ్లండ్ సిరీస్‌లోనే:
2019 వన్డే ప్రపంచకప్ సమయంలో తొలిసారి ఆవలింతలు తీస్తూ సర్ఫరాజ్ అహ్మద్ నెటిజన్ల చేతికి చిక్కాడు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ల మధ్య వేగంతో పరుగు తీస్తుంటే.. వికెట్ల వెనుక ఉన్న సర్ఫరాజ్ ఆవలింతలు తీస్తూ కనిపించాడు. దీంతో పాక్ అభిమానులు కూడా దుమ్మెత్తిపోశారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్‌ని పూర్తిగా బెంచ్‌పైనే కూర్చోబెట్టేసింది. ఆ అప్పుడు కూడా మనోడు ఆవలింత తీసి అబాసుపాలయ్యాడు. తాజాగా రెండో టీ20 కూడా అదే పునరావృతం చేశాడు. కదలకుండా కూర్చోవడంతోనేమో.. సర్ఫరాజ్ టెస్టు, టీ20ల్లో ఆవలింతలతో కెమెరాకి చిక్కాడు.

మూడు ఫార్మాట్లలలో ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్:
ఒకటి సారి కాదు రెండు సార్లు కాదు.. మూడోసారి కూడా సర్ఫరాజ్ అహ్మద్ ఆవలింతల తీయడంతో నెటిజన్లు ఊరుకుంటారా? మరి. తమతమ మెదడులకు పనిచెప్పారు. 'మూడు ఫార్మాట్లలలో ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్' అని ఓ బిరుదిచ్చేశారు. ఆ బిరుదును హైలేట్ చేస్తూ.. అతనిపై మీమ్స్, సెటైర్లతో ఆటాడుకుంటున్నారు. పాపం సర్ఫరాజ్.. ఇప్పటికైనా ఆ ఆవలింతల తీయడం ఆపుతాడో లేదో చూడాలి మరి. సర్ఫరాజ్ పాకిస్థాన్ తరఫున 49 టెస్టులు, 116 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.
CSK: సీఎస్‌కేకు భారీ ఉపశమనం.. దుబాయ్ చేరుకున్న కీలక ఆటగాళ్లు!!


Click it and Unblock the Notifications












