Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK: సీఎస్‌కేకు భారీ ఉపశమనం.. దుబాయ్ చేరుకున్న కీలక ఆటగాళ్లు!!

IPL 2020: Chennai Super Kings duo Faf du Plessis and Lungi Ngidi land in UAE
IPL 2020 : Chennai Super Kings Might Not Play The Opening Match Of IPL 2020 || Oneindia Telugu

దుబాయ్: గత వారం రోజులుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్న విషయం తెలిసిందే. మొదటగా ఆ జట్టును కరోనా వైరస్ కలవర పెట్టగా.. ఆ తర్వాత స్టార్ బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా అర్ధతరంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఈ రెండు అంశాలతో చెన్నై యాజమాన్యంలో అలజడి రేగింది. ఇక తాజాగా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ ‌సింగ్‌ కూడా ఈ సారి ఐపీఎల్‌ నుంచి తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సీఎస్‌కేకు భారీ ఉపశమనం లభించింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఇద్దరు సీఎస్‌కేకు బృందంలో కలిశారు.

దుబాయ్ చేరుకున్న డుప్లెసిస్‌, ఎంగిడి

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌, స్టార్ పేసర్ లుంగీ ఎంగిడి మంగళవారం ఉదయం దుబాయ్‌ చేరుకున్నారు. వీరితో పాటు మరో స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా దుబాయ్‌ వచ్చాడు. డుప్లెసిస్‌, ఎంగిడిలు సీఎస్‌కే బస చేస్తున్న హోటల్‌కు వెళ్లగా.. రబాడ ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ హోటల్‌కు వెళ్లాడు. దక్షిణాఫ్రికా త్రయం ముగ్గురు ప్రస్తుతం 6 రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ సమయంలో మూడు వైరస్ పరీక్షలు వారికి చేయనున్నారు.

సీఎస్‌కేకు భారీ ఉపశనం

సీఎస్‌కేకు భారీ ఉపశనం

ఆగష్టు చివరి వారం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు విషాదాన్ని మిగిల్చినా.. సెప్టెంబర్ నెల సీఎస్‌కేకు కొత్త ఆశను తెచ్చిపెట్టింది. ఫాఫ్ డుప్లెసిస్‌, లుంగీ ఎంగిడి జట్టులో చేరనుండడంతో ఆ జట్టుకు భారీ ఉపశనం కలిగించే అంశమే. ఎందుకంటే.. టాప్ ఆర్డర్‌లో డుప్లెసిస్‌ కీలకం. అవసరమైతే ఓపెనింగ్ కూడా చేయగలడు. ఇక సీఎస్‌కే బౌలింగ్ విభాగానికి ఎంగిడి వెన్నెముక. రెండు ఫ్రాంఛైజీలు తమ అధికారిక ట్విటర్లో ప్రొటీస్‌ ప్లేయర్ల ఫొటోలను షేర్‌ చేస్తూ.. దుబాయ్ వచ్చారని తెలిపాయి.

డైలమాలో హర్బజన్:

డైలమాలో హర్బజన్:

సీఎస్‌కే వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ ‌సింగ్‌ ఈ సారి ఐపీఎల్‌ నుంచి తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం రోజునే చెన్నై జట్టుతో కలవాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆయన దుబాయ్‌కే చేరుకోలేదు. దీంతో అతను ఐపీఎల్ ఆడుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే చెన్నై జట్టులోని పలువురు సభ్యులకు కరోనా నిర్ధారణ కావడంతో హర్భజన్‌ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.‌ రైనా హఠాత్తుగా భారత్ తిరిగి రావడంతో అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవని భజ్జీ భావించడంతోనే దుబాయ్ వెళ్ళడానికి ఆయన వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అన్ని బాగుంటే టోర్నీ మధ్యలో జాయిన్ అవ్యాడమా లేదా?.. అసలు ఐపీఎల్‌కే దూరం కావడమా? అనే ఆలోచనలో హర్బజన్ ఉన్నట్లు సమాచారం.

ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు అవకాశం:

ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు అవకాశం:

జట్టు సభ్యుల్లో 13 మందికి కరోనా సోకడం చెన్నై ఫ్రాంచైజీని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ లాంటి ఆటగాళ్ళు కరోనా బారిన పడడం యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. అయితే టోర్నీ సమయానికి వారు కోలుకునే అవకాశం ఉంది. మరోవైపు చెన్నై ఇంకా ప్రాక్టీస్‌ మొదలుపెట్టలేదు. ఆటగాళ్లు సాధన చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై స్థానంలో మరో బెంగళూరు ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 13వ సీజన్‌ దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబవర్‌ 10 వరకు జరగనుంది.

IPL 2020: ఆర్‌సీబీకి భారీ షాక్.. స్టార్ పేసర్ ఔట్!!

Story first published: Tuesday, September 1, 2020, 14:06 [IST]
Other articles published on Sep 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+