ఒంటి చేత్తో ప్రపంచకప్‌లు గెలవగలడు.. కోహ్లీని పక్కనపెట్టడం ఏంది? మాజీ సెలెక్టర్ ఫైర్!

న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ మద్దతు తెలిపాడు. కోహ్లీకి ఒంటిచేత్తో ప్రపంచకప్‌లు గెలిపించే సత్తా ఉందని, అతన్ని పక్కనపెట్టమనడం ఏందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఎన్నో అంచనాలతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు.
నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 43 (టెస్ట్‌లో 31, టీ20ల్లో1, 11) పరుగులే చేశాడు. దాంతో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని కపిల్ దేవ్ వంటి దిగ్గజ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. దాంతో విరాట్‌కు మద్దతుగా మరికొంత మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే గవాస్కర్.. కోహ్లీని వెనుకేసుకురాగా ఆ జాబితాలో శరణ్‌దీప్ సింగ్ కూడా చేరాడు.

ఒంటి చేత్తో ప్రపంచకప్ గెలిపించగలడు..
టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీకి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నాడు. 'విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి సెలెక్టర్లు ఏం చేస్తున్నారు. అతన్ని జట్టు నుంచి ఎట్టిపరిస్థితుల్లో తప్పించకూడదు. విరాట్ కోహ్లీ శక్తి, సామర్థ్యాలు ఏంటో అందరికి తెలుసు. అతను ఒంటి చేత్తో ప్రపంచకప్‌లు గెలిపించగలడు. అసలు కోహ్లీకి మాటి మాటికి విశ్రాంతి ఎందుకు ఇస్తున్నారు. అసలు ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలెక్టర్లు ఏం లాజిక్ పాటిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు.

రెస్ట్ అవసరం లేదు..
కోహ్లీని ఒక సిరీస్‌లో ఆడించి మరో సిరీస్‌లో పక్కనపెట్టడం ఏ మాత్రం సరైంది కాదు. అతనికి వీలైనన్ని అవకాశాలిచ్చి అండగా ఉంటే తిరిగి ఫామ్ అందుకుంటాడు. అంతేగానీ టీవీల ముందు కూర్చోని మ్యాచ్ చూస్తే ఫామ్ ఎలా వస్తుంది? కెరీర్‌లో ప్రతీ ఆటగాడు ఈ తరహా దశను ఎదుర్కొంటాడు. ఎత్తు పల్లాలను చూస్తాడు. అంతామాత్రానికే సదరు ఆటగాడి విలువ ఏం తగ్గిపోదు. మనం ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒక ఆటగాడు చాలా కాలంగా బాగా ఆడి కొద్ది మ్యాచ్‌ల్లో ఆడలేదని పక్కనపెట్టడం సరికాదు. అతని ప్రాధ్యాత ఏంటో తెలుసుకోవాలి'అని శరణ్ దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.

గవాస్కర్ సైతం..
విరాట్ కోహ్లీపై వచ్చిన విమర్శలను గవాస్కర్ సైతం తప్పుబట్టాడు. 'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లు పరుగులు చేయనప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడరు?. అందరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం టీమిండియా దూకుడు మంత్రాని జపిస్తోంది. ధాటిగా ఆడే క్రమంలో కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమవ్వడం సహజం. అయినా సరైన జట్టును ఎంపిక చేసేందుకు, ఆటగాళ్లపై వేటు వేసేందుకు సరైన సెలెక్షన్ కమిటీ ఉంది. వారు తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు.'అని చెప్పాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కపిల్ దేవ్‌కు ఏం తెలుసు..
కోహ్లీని తప్పించాలంటూ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తప్పుబట్టాడు. 'టీమిండియా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మేము పట్టించుకోవడం లేదు. అసలు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఎవరో నాకు తెలియదు. వారిని ఎందుకు అలా పిలుస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. వారు బయట నుంచి చూస్తున్నారు. టీమిండియాలో ఏమి జరుగుతుందో వారికి తెలియదు. మేము ప్రపంచకప్ లక్ష్యంగా ఒక జట్టును తయారు చేసుకొంటున్నాం. అనేకసార్లు చర్చించిన తర్వాతే మార్పులపై నిర్ణయాలు తీసుకుంటున్నాము. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాము. ఈ విషయాలన్నీ బయట వారికి తెలియవు.'అని క్రికెట్ విమర్శకుల ప్రశ్నలకు రోహిత్ సమాధానమిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications