రోహిత్-ధావన్‌దే అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ.. టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలి!

న్యూఢిల్లీ: భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లదే అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ అని, అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో వీరినే ఓపెనర్లుగా కొనసాగించాలని మాజీ క్రికెటర్, సెలెక్టర్ శరన్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శిఖర్ ధావన్ విఫలమవడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసి యువ ఆటగాడైన ఇషాన్ కిషన్‌కు అవకాశమిచ్చింది. ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకొని అందరిచేతా ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు చివరి టీ20లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. భవిష్యత్‌లోనూ తాను ఓపెనింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శరన్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

లెఫ్ట్ రైట్ కాంబినేషన్..
'తొలి టీ20 తర్వాత ధావన్‌ను తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనల్లో బాగా ఆడాడు. మానసికంగా అతడెంతో దృఢంగా ఉంటాడు. ఎప్పుడు ఆడినా పరుగులు చేస్తాడు. అయితే, తొలి టీ20 తర్వాత టీమిండియా అతన్ని పక్కన పెట్టి ఇతరులకు అవకాశం ఇవ్వాలని చూసిందేమో! కానీ, నా అభిప్రాయం ప్రకారం.. రోహిత్-ధావన్‌ల రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషనే అత్యుత్తమ జోడి. టీ20 ప్రపంచకప్‌లో వాళ్లిద్దరే ఓపెనింగ్ చేయాలి.

ఐపీఎల్‌లో సత్తా చాటితేనే..
ఒక్క మ్యాచ్‌లో ఆడనంత మాత్రాన ధావన్‌ను అలా పక్కన పెట్టడం సరికాదు. టీ20 సిరీస్ తర్వాత వన్డేల్లో గబ్బర్ మంచి ప్రదర్శనే చేశాడు. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీయే టీమిండియా ప్రపంచకప్ జట్టును నిర్ణయిస్తుంది. అందులో చోటు దక్కాలంటే ఇషాన్ కిషన్ కూడా అత్యద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది' అని శరన్ అభిప్రాయపడ్డాడు.

మరో పదేళ్లు పంత్‌దే..
అనంతరం రిషభ్ పంత్‌పై ఈ మాజీ సెలెక్టర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌ను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. 'గతంలో పంత్ ఫిట్‌నెస్, షాట్ల ఎంపికలో ఇబ్బంది పడ్డాడు. దాంతో వాటి మీద దృష్టిసారించి చాలా మెరుగయ్యాడు. అనుభవంతోనే ఏ క్రికెటర్ అయినా చెలరేగుతాడు. హార్దిక్ పాండ్యా ఇప్పుడు అనుభవంతో ఆడుతున్నట్లే పంత్ కూడా గత ఆరు నెలలుగా ఆడుతున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఇంకో పదేళ్లు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.'అని శరన్‌దీప్ చెప్పుకొచ్చాడు. ఇక శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా పంత్ వన్డేల్లో చోటు దక్కించుకున్నాడని, అతడు తిరిగొస్తే కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్‌కు అప్పగించాలన్నారు.

కృనాల్ సెట్ కాడు..
ఇక వన్డే ఫార్మాట్‌కు కృనాల్ పాండ్యా సెట్ కాడని, అతడితో పది ఓవర్ల కోటా బౌలింగ్ చేయించడం కష్టమన్నాడు. కృనాల్ టీ20 క్రికెట్‌కే సరిపోతాడన్నాడు. చివరగా ఇద్దరు కెప్టెన్ల విషయంపై మాట్లాడిన మాజీ క్రికెటర్.. విరాట్ కోహ్లీని తొలగించాల్సిన అవసరం లేదన్నాడు. తాను సెలెక్షన్ కమిటిలో ఉండగా ఈ ప్రస్తావనే రాలేదన్నాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో బాగా ఆడుతున్నాడని, ఒకవేళ ఏదైనా ఫార్మాట్‌లో రాణించకపోతే అప్పుడా విషయం గురించి ఆలోచించాలన్నారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదని ఈ మాజీ సెలెక్టర్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications