
పుజారా రాణించాల్సిందే..
'భారత బ్యాటింగ్ యూనిట్ ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. కేఎల్ రాహుల్ మినహా ఎవ్వరూ రాణించడం లేదు. ప్రతిసారీ అతడిపైనే ఆధారపడలేం. అలాగే కెప్టెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అయితే ఇక్కడ పుజారా గురించి చెప్పుకోవాలి. అతడు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతడి స్థానంలో ఇటీవల న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ లాంటి యువకులు ఎదురుచూస్తున్నారు. పుజారా లాంటి సీనియర్ బ్యాటర్ తరచూ ఇలాగే విఫలమైతే త్వరలోనే చోటు కోల్పోవాల్సి ఉంటుంది' అని శరణ్‌దీప్ వివరించారు.

నో డౌట్.. కోహ్లీసేనదే సిరీస్..
'మరోవైపు సౌతాఫ్రికా సిరీస్‌లో టీమిండియా ఒక జట్టుగా బాగా ఆడుతోంది. అక్కడ సిరీస్ గెలుస్తారనే పూర్తి నమ్మకం ఉంది. ఇక సఫారీల గురించి మాట్లాడితే.. వాళ్లు సిరీస్ గెలవడం కోసం కాకుండా ఏదో ఆడాలన్నట్లు ఆడుతున్నారు. ఇప్పుడు ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో బలహీనంగా ఉంది. రెండో టెస్టు నుంచి క్వింటన్ డికాక్ కూడా వైదొలుగుతున్నాడు. దీంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలహీన పడనుంది. అలాగే భారత బౌలింగ్ దళం కూడా అద్భుతంగా పనిచేస్తోంది. ఇషాంత్ స్థానంలో ఆడుతున్న సిరాజ్ చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. బుమ్రా అయితే టీమిండియాకు మాస్టర్ పీస్‌గా కొనసాగుతున్నాడు. దీంతో కచ్చితంగా కోహ్లీసేన సిరీస్ గెలుస్తుందనే అనుకుంటున్నా' అని మాజీ సెలెక్టర్ పేర్కొన్నాడు.

బుమ్రా వైస్ కెప్టెనా?
సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ప్రకటించడం చూసి తాను ఆశ్చర్యపోయానని శరణ్‌దీప్ సింగ్ తెలిపాడు. ఇక కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ సరైనవాడని తెలిపాడు. 'టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణిస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ జస్‌ప్రీత్ బుమ్రానే వైస్ కెప్టెన్‌గా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఓ పేసర్ వైస్ కెప్టెన్‌గా ఉండటం అనేది భిన్నం. అతను బౌండరీ దగ్గరు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను కెప్టెన్‌కు ఎలా సహకారంగా ఉంటాడు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు నిర్వహించే మీటింగ్స్ ఎలా పాల్గొంటాడు.'అని శరణ్‌దీప్ సింగ్ ప్రశ్నించాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ-బీసీసీఐ మధ్య నెలకొన్న వాగ్వాదం సమసిపోయినట్లేనని చెప్పుకొచ్చాడు.

18 మంది సభ్యులతో
జనవరి 19న దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు 18 మంది సభ్యులతో భారత జట్టును గత శుక్రవారం ప్రకటించారు. గాయం నుంచి కోలుకోకపోవడంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ రోహిత్‌శర్మ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. పేసర్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా టెస్టు సిరీస్ ఆడలేకపోతున్న రోహిత్ ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ''రోహిత్‌తో సెలక్టర్లందరూ మాట్లాడారు. అతడు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు. ఈ స్థితిలో అతడితో ప్రయోగాలు చేయలేం. ఇప్పుడు దక్షిణాఫ్రికాకు రావడం కంటే పునరావాసంలో ఉండడమే ఉత్తమమని భావించాం. అతడు ఇంకా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. అతడు వంద శాతం ఫిట్‌నెస్ సాధించాలి. మున్ముందు ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సిద్ధం కావాలి. అలాగే కెప్టెన్‌గా రాహుల్‌కు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రస్తుత జట్టును నడిపించడానికి అతడే సరైన ప్రత్యామ్నాయం'' అని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్‌శర్మ అన్నాడు.


Click it and Unblock the Notifications












