శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం.. నెటిజన్లకు సారా టెండూల్కర్ స్పెషల్ రిక్వెస్ట్!
Sara Tendulkar: సోషల్ మీడియా వేదికగా తన పేరిట జరుగుతున్న అసత్య ప్రచారాన్ని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ ఖండించింది. తన పేరిట ఉన్న నకిలీ ఖాతాల్లో డీప్ ఫేక్ ఫొటోలను షేర్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు ఖతాలపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌కు విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు సారా టెండూల్కర్ ( Sara Tendulkar) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో సారా టెండూల్కర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతుంది. టీమిండియా మ్యాచ్‌లకు హాజరైనప్పుడల్లా శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేసే సమయంలో టీవీ కెమెరాలు పదే పదే సారా టెండూల్కర్‌ను చూపించడంతో పాటు ఈ ఇద్దరూ ప్రైవేట్ కార్యక్రమాల్లో కలుసుకోవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది.

వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా టీమిండియా ఆడిన కీలక మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరవ్వడంతో ఈ ఇద్దరి లవ్ గాసిప్స్ హల్‌చల్ చేశాయి. శుభ్‌మన్ గిల్‌తో సారా టెండూల్కర్ ఉన్న డీప్ ఫేక్ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. సారా టెండూల్కర్ పేరిట ఎక్స్ వేదికగా బ్లూటిక్ మార్క్‌తో ఉన్న ఓ అకౌంట్‌లోనే శుభ్‌మన్ గిల్ ఫొటోలను షేర్ చేయడం.. అతన్ని లవ్ చేస్తున్నట్లు ప్రకటించడం వంటి పోస్ట్‌లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Sara Tendulkar has posted a story on Instagram on her parody account impersonating her on Twitter. pic.twitter.com/i3XhfIdTkv
— Cricketopia (@CricketopiaCom) November 22, 2023
దాంతో ఈ ఫేక్ ప్రచారంపై స్పందించిన సారా టెండూల్కర్.. ఎక్స్ వేదికగా తనకు అకౌంటే లేదని, అవన్నీ నకిలీ ఖాతాలు అని స్పష్టం చేసింది. సదరు ఖాతాలపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ ఫ్లాట్‌ఫామ్‌ను కోరింది. వీలైనంత త్వరగా తన పేరిట ఉన్న నకిలీ ఖాతాలను గుర్తించి తొలిగించాలని డిమాండ్ చేసింది.
'మన సంతోషాలు, బాధలతో పాటు దిన చర్యలను పంచుకునేందుకు సోషల్ మీడియా అద్భుతమైన వేదిక. అలాంటి ఈ వేదికను అవాస్తవాలతో నింపేస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతోంది.
నాకు సంబంధించిన డీప్ ఫేక్ ఫొటోలను నేను చూశాను. ఎక్స్(ట్విటర్) వేదికగా నా పేరిట ఉన్న కొన్ని ఖాతాలు జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వాస్తవానికి ఎక్స్‌వేదికగా నాకు అకౌంట్ లేదు. నా పేరిట ఉన్న నకిలీ ఖాతాలను ఎక్స్ గుర్తించి తొలగిస్తుందని ఆశిస్తున్నాను. వినోదం కోసం నిజాన్ని పణంగా పెట్టకూడదు.
వాస్తవాలను పంచుకోవడానికే సోషల్ మీడియాను ఉపయోగిద్దాం. ఆ తరహా కమ్యూనికేషన్‌ను మాత్రమే ప్రోత్సహిద్దాం.'అని సారా టెండూల్కర్ విజ్జప్తి చేసింది. ఈ పోస్ట్‌లో ఎక్కడా కూడా శుభ్‌మన్ గిల్ పేరును ప్రస్తావించలేదు. అతనితో లవ్ ఎఫైర్ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. నకిలీ ఖాతాలను మాత్రమే తొలగించాలని రిక్వెస్ట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications