Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దివినుంచి దిగి వచ్చిన సారా.. వధువు కంటే వదినే హైలైట్ !

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలైన సానియా చందోక్‌‌ను వివాహం చేసుకున్నాడు. గురువారం ముంబైలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి అతిరథ మహారథులంతా హాజరయ్యారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు, మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో మెరిసారు.

ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పెళ్లిలో వధువు సానియా చందోక్ కంటే ఆమె వదిన, అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చీరకట్టులో సారా అసలైన లైమ్‌లైట్‌ను సొంతం చేసుకుంది.

పెళ్లిలో పింక్ కలర్ వర్క్ సారీలో కనిపించిన సారా.. మెడలో దగదగ మెరిసే నగల వెలుతురులో రాకుమారిలా కనిపించింది. సారాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. వధువు కంటే వదినే అందంగా ఉందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దివినుండి దిగి వచ్చిన తార.. సారా టెండూల్కర్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. సారా టెండూల్కర్ ముందు బాలీవుడ్ హీరోయిన్ కూడా పనికిరాదని కామెంట్ చేస్తున్నారు.

Sara Tendulkar Steals the Limelight in Stunning Pink Manish Malhotra Saree at Brother Arjun s Wedding
Photo Credit: X (twitter)

మెహిందీ ఫంక్షన్‌లోనూ సారా టెండూల్కర్ తన కట్టు బొట్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది. బాంధని లెహంగాలో మెరిసిన ఆమె చూపరులను మంత్రముగ్థులను చేసింది. పర్పుల్ కలర్ బేస్‌పై మల్టీకలర్ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ ఉన్న లెహంగాకు తోడు గ్రీన్ కలర్ దుపట్టా ఆమెకు రాకూమారి లుక్ తెచ్చింది. పంజాబ్ శైలి జడ గంటలు ఆమె ఆహర్యాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. గ్లోయింగ్ మేకప్, మెహందీతో నిండిన చేతులు ఆమె సహజ సౌందర్యాన్ని రెట్టింపు చేశాయి. సారా స్టైలిష్‌ లుక్‌ను చూసిన నెటిజన్లు వధువు కంటే ఆమె మెరిసిపోయిందని దిష్టి పెడుతున్నారు.

అర్జున్ టెండూల్కర్ సతీమణి సానియా చందోక్.. సారా టెండూల్కర్‌కు బెస్ట్ ఫ్రెండ్. సారా కోసం ఇంటికి వచ్చే క్రమంలో సానియా చందోక్‌పై మనసు పారేసుకున్న అర్జున్ టెండూల్కర్.. సీక్రెట్‌గా పటాయించాడు. అక్కకు ఏ మాత్రం అనుమానం రాకుండా సానియా చందోక్‌ను ముగ్గులోకి దించాడు. ఈ ఇద్దరి ప్రేమాయణం తెలిసి సారా టెండూల్కర్, సచిన్ టెండూల్కర్ అవాక్కయ్యారు. పెళ్లి చేసుకుంటామని చెప్పే వరకు వారికి ఈ ఇద్దరి లవ్ స్టోరీ గురించి తెలియదంట.

ఈ ఏడాది ఆగస్టులోనే అర్జున్-సానియాల నిశ్చితార్థం అత్యంత గోప్యంగా జరిగింది. నిశ్చితార్థం అయిన కొన్ని రోజులకు సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దేశవాళీ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, March 6, 2026, 17:09 [IST]
Other articles published on Mar 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+