For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS మూడో టీ20కి సారా టెండూల్కర్.. శుభ్‌మన్ గిల్ కోసమేనా?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ మరోసారి భారత క్రికెట్ మ్యాచ్‌కు హాజరైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో హోబర్ట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సారా టెండూల్కర్ మెరిసింది. ముఖ్యంగా టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే టీవీ కెమెరాలు సారా టెండూల్కర్‌ను పదే పదే చూపించాయి. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని సారా టెండూల్కర్ టీమిండియాకు మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

శుభ్‌మన్ గిల్ కోసమే..

శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు హాజరైందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ పలు కార్యాక్రమాలకు హాజరైన ఫొటోలు బయటకు రావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

శుభ్‌మన్ గిల్ సోదరితో కలిసి సారా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తాము లవ్‌లో ఉన్నట్లు ఇటు సారా టెండూల్కర్ కానీ, అటు శుభ్‌మన్ గిల్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని ఇంటర్వ్యూల్లో ఇవన్నీ రూమర్స్ అని శుభ్‌మన్ గిల్ కొట్టిపారేసాడు. తాను ఎవరితో ప్రేమలో లేనని, క్రికెట్‌ను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పాడు.

Sara Tendulkar Spotted Cheering for Team India During 3rd T20I Against Australia at Hobart
Photo Credit: Screengrab from JioHotstar

దాగుడు మూతల ప్రేమ..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రూమర్స్‌పై సచిన్ ఫ్యామిలీ ఇప్పటి వరకు స్పందించలేదు. యువరాజ్ సింగ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి శుభ్‌మన్ గిల్‌తో పాటు సారా టెండూల్కర్ హాజరైంది. ఆ సమయంలో ఈ ఇద్దరూ దొంగ చూపులు చూసుకోవడం.. గిల్‌ను జడేజా ఆటపట్టించడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే సారా-గిల్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ హాజరైనా శుభ్‌మన్ గిల్‌కు కలిసి రాలేదు. 12 బంతుల్లో 15 పరుగులే చేసి గిల్ ఎల్బీగా వెనుదిరిగాడు. సారా టెండూల్కర్‌ను టీవీల్లో చూపించిన మరుసటి క్షణమే గిల్ ఔటవ్వడం గమనార్హం.

చెలరేగిన డేవిడ్, స్టోయినీస్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. టీమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), మార్కస్ స్టోయినీస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/31) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/33) రెండు వికెట్లు తీయగా.. శివమ్ దూబే(1/43) ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మైదానంలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

Story first published: Sunday, November 2, 2025, 16:35 [IST]
Other articles published on Nov 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+