భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సారా టెండూల్కర్ బీర్ బాటిల్‌తో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సచిన్ అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. సారా తీరును తప్పుబడుతూ సారా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకల కోసం సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ ఆమె గోవా వీధుల్లో తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.
గోవాలో సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ బైకర్ ఆమెకు ఎదురుగా వెళ్తూ వీడియో తీసాడు. ఇందులో సారా చేతిలో ఒక బాటిల్ ఉంది. అయితే అది బీర్ బాటిల్ అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సచిన్ కూతురు ఇలాంటి పనులు చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ పేరు చెడగొడుతుందని ఆవేదనకు గురవుతున్నారు.

మరికొందరు మాత్రం సారా టెండూల్కర్‌కు అండగా నిలుస్తున్నారు. బీర్ తాగడం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. సారా బీర్ తాగితే సచిన్ టెండూల్కర్ ప్రతిష్టకు భంగం ఎందుకు కలుగుతుందని, మనం ఏ కాలంలో ఉన్నామని ప్రశ్నిస్తున్నారు. సారా తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించకూడదా? అని ప్రశ్నిస్తున్నారు.
క్రికెట్‌పై ఆసక్తి లేకపోవడంతోనే తాను ఈ రంగాన్ని ఎంచుకోలేదని సారా టెండూల్కర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన తండ్రి ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లు తనకు గుర్తు ఉన్నాయని, కానీ తన తమ్ముడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌ను కెరీర్ ఎంచుకున్నాడని గుర్తు చేసింది. చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడానని చెప్పిన సారా.. ప్రొఫెషనల్ క్రికెట్ ఎప్పుడూ ఆడలేదని, ఆడాలని కూడా కోరుకోలేదని స్పష్టం చేసింది.
సారా టెండూల్కర్.. సచిన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థలతో పాటు కొన్ని వ్యాపారాలను నిర్వహిస్తోంది. ముంబై, అంధేరిలో 'పిలేట్స్ అకాడమీ ఎక్స్ సారా టెండూల్కర్' పేరుతో ఒక వెల్నెస్ సెంటర్‌ను నడిపిస్తోంది. క్లినికల్ న్యూట్రిషణ్, పబ్లిక్ హెల్త్ నేపథ్యం ఉన్న సారా.. ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.