Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు అలాంటి మొగుడే కావాలి: సారా టెండూల్కర్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిలాంటి మొగుడే కావాలని తెలిపారు. తన తల్లిదండ్రులైన సచిన్ టెండూల్కర్, అంజలిల మధ్య ఉన్న స్నేహపూర్వక బంధమే తనకు ఆదర్శమని, తాను కూడా అలాంటి బంధాన్ని కోరుకుంటున్నానని చెప్పారు.

ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ 'వోగ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా టెండూల్కర్ తన భాగస్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా తల్లిదండ్రులు భార్యా భర్తల కంటే ముందు మంచి ఫ్రెండ్స్. వారి మధ్య జరిగే సరదా సంభాషణలను నేను నిత్యం గమనిస్తుంటా. నాకు లభించే భాగస్వామి నుంచి కూడా నేను అదే స్నేహాన్ని కోరుకుంటున్నా. మా అమ్మ నాన్నల మధ్య ఎలాంటి ఆధిపత్య ధోరణి ఉండదు. వారి అన్యోన్యతే నాకు స్ఫూర్తి.

Sara Tendulkar Reveals She Wants a Husband With Traits Similar to Father Sachin Tendulkar

పెళ్లి విషయంలో తొందరపడను..

పెళ్లి విషయంలో సమాజం లేదా కుటుంబం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లకు తలొగ్గి నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. ఈ తరం భాగస్వామి సరైన వ్యక్తి కాదని తెలిస్తే.. నిశ్చితార్థం తర్వాత కూడా బంధాన్ని వదులుకోవడానికి వెనుకాడటం లేదు. మా ముందు తరాల వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించేవారు. కానీ నేటి జెన్ జీ తరం తమకు నచ్చని విషయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తున్నారు.

మా తమ్ముడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి నాకు ఒక ట్రయల్‌గా ఉపయోగపడింది(నవ్వుతూ). గతంలో అత్యంత అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని ఉంది. 'అని సారా టెండూల్కర్ చెప్పుకొచ్చారు.

శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం..

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సారా టెండూల్కర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. శుభ్‌మన్ గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరవ్వడం, ఈ ఇద్దరూ సీక్రెట్‌గా కలుసుకోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే తమ బంధంపై సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలా అని ఈ రూమర్స్‌ను ఖండించలేదు.

Story first published: Tuesday, August 11, 2026, 10:44 [IST]
Other articles published on Aug 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+