Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తమ్ముడికి హ్యాండిచ్చిన సారా టెండూల్కర్.. ప్రియుడి కోసం లక్నోకు..? (వీడియో)

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ లక్నోలో సందడి చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం ఆమె లక్నోకు వచ్చినట్లు తెలుస్తోంది.

లక్నో ఎయిర్‌పోర్ట్‌లో సారా టెండూల్కర్‌ను చూసిన మీడియా ప్రతినిధులు.. ఎవరికి సపోర్ట్ చేస్తారంటూ ఆమెను ప్రశ్నించారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకా..? లేక తన తమ్ముడు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు మద్దతు తెలుపుతారా? అని ప్రశ్నించారు. సారా టెండూల్కర్ మాత్రం సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో వారికి దూరంగా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

Sara Tendulkar s Priceless Reaction Supporting Brother Arjun s LSG or Shubman s GT
Photo Credit: twitter (X)

తన ప్రియుడు శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్‌ లక్నోకు వచ్చిందని, గుజరాత్ టైటాన్స్‌కే మద్దతు తెలుపుతుందని కామెంట్ చేస్తున్నారు. తమ్ముడు జట్టు అయిన లక్నో సూపర్ జెయింట్స్‌కు సపోర్ట్ చేసేందుకు అతను ఏమైనా తుది జట్టులో ఆడుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్‌కు మద్దతు తెలిపేందుకే సారా లక్నోకు వచ్చిందని, లేకుంటే తన తమ్ముడు ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు మద్దతు తెలుపుతానని మీడియాకు తెలిపేదని ఫ్యాన్స్ అంటున్నారు.

ఏది ఏమైనా సొంత తమ్ముడికి సారా టెండూల్కర్ షాకిచ్చిందని, తమ్ముడు అర్జున్ టెండూల్కర్ కంటే ప్రియుడు శుభ్‌మన్ గిల్ ఎక్కువయ్యాడని కామెంట్ చేస్తున్నారు. సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ తమ ప్రేమ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వార్తలను కూడా ఖండించలేదు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన లక్నో ఆదివారం సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. శుక్రవారం సారా టెండూల్కర్ లక్నో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఈ మ్యాచ్ కోసమే సారా వచ్చిందని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె రాకపై ఎలాంటి క్లారిటీ లేదు. బహుషా అర్జున్ సతీమణి, తన మరదలుకు తోడుగా వచ్చి ఉంటుందని, అనవసర పుకార్లు పుట్టించవద్దని సచిన్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Story first published: Friday, April 10, 2026, 19:09 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+