సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచింది. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సారా టెండూల్కర్.. అతనితో పెళ్లికి కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. వీరి ప్రేమాయణానికి ఇరు కుటుంబాలు పచ్చ జెండా ఊపినట్లు అర్థమవుతోంది.
తాజాగా శుభ్‌మన్ గిల్ సోదరి షాహ్నీల్ గిల్‌తో కలిసి ఆమె లేట్ నైట్ పార్టీకి వెళ్లడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. షాహ్నీల్ గిల్‌తో కలిసి సారా టెండూల్కర్ షికారుకు వెళ్లిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఈ ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. షాహ్నీల్ గిల్ మాస్క్‌తో తన ముఖం దాచుకునే ప్రయత్నం చేయగా.. సారా మాత్రం మీడియాను ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ ఇద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా చిగురించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఫాలో అవ్వడం.. కామెంట్లు చేసుకోవడంతో ఈ ఇద్దరి ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు నెట్టింట షికారు చేశాయి. మధ్యలో సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో సారా-గిల్ మధ్య బ్రేకప్ అయ్యిందని అంతా భ్రమపడ్డారు.
కానీ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సారా అలీఖాన్.. శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న సారా తాను కాదని, మరో సారా అని క్లారిటీ ఇచ్చింది. దాంతో సారా-గిల్ దాగుడు మూతల ప్రేమపై అందరికి క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ సందర్భంగా ముంబై, పుణే వేదికగా భారత్ ఆడిన మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరైంది.
శుభ్‌మన్ గిల్ భారీ షాట్లు ఆడినప్పుడు ఎగిరి గంతేసిన సారా.. అతను ఔటైనప్పుడు నొచ్చుకుంది. మైదానంలో గిల్ ఆడుతున్నంత సేపు టీవీ కెమెరామెన్ సారానే చూపించేవాడు. దాంతో వీరి ప్రేమాయణం నిజమేననే స్పష్టత వచ్చింది. సోషల్ మీడియా వేదికగా సారా-గిల్ ప్రేమాయణం గురించి ఇంత జరుగుతున్నా.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ తన కూతురిని పదే పదే చూపిస్తున్నా.. సచిన్ టెండూల్కర్ మౌనంగా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.
అంతేకాకుండా జియో ప్లాజా ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ ఇద్దరూ కలుసుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. మరికొద్ది రోజుల్లో గిల్-సారా పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. యశస్వి జైస్వాల్ రాకతో ఓపెనింగ్ స్లాట్‌ను కోల్పోయిన గిల్.. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. చతేశ్వర్ పుజారా లోటును భర్తీ చేసే బాధ్యత అతనిపై ఉంది.