ఎంతకు తెగించార్రా.. సారా టెండూల్కర్ ఔట్ ఫిట్ మార్చేస్తారా? (వీడియో)
భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌కు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో రూపొందించిన ఈ వీడియో సారా టెండూల్కర్ ప్రతిష్టను దిగజార్చేలా ఉంది. ఈ డీప్ ఫేక్ వీడియోను నిజమేనని పొరబడిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోలో ఏం ఉందంటే..?
జిమ్ నుంచి బయటకు వచ్చిన సారా టెండూల్కర్ వీడియోను ఏఐ సాయంతో కొందరు ఆకతాయిలు మార్చేసారు. సారా టెండూల్కర్ జిమ్ ఔట్ ఫీట్‌ను మార్చి అశ్లీలంగా వీడియోను రూపొందించారు. ఈ డీప్ ఫేక్ వీడియోలో బ్లాక్ బ్రా ధరించిన సారా టెండూల్కర్.. తొడలు కనిపించేలా చిన్న షార్ట్ ధరించింది. ఈ డీప్ ఫేక్ వీడియోలో చాలా హాట్‌గా కనిపించింది. బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే సారా టెండూల్కర్‌ను ఇలా హాట్‌గా చూసిన నెటిజన్లు షాకయ్యారు. నిజమేనని పొరబడి షేర్ చేస్తున్నారు.

కానీ ఆమె రియల్ వీడియోలో శరీరమంతా కవర్ అయ్యే ఔట్ ఫిట్‌ను ధరించారు. బ్లాక్ టీషర్ట్‌తో పాటు ప్యాంట్ ధరించగా.. వాటిని బ్రా, షార్ట్‌గా ఏఐ సాయంతో మార్చేసారు. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ ఈ డీప్ ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నకిలీ వీడియో అని పేర్కొంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ వ్యవహారాలను సారా టెండూల్కర్ చూసుకుంటుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది.

మా నాన్నలా ఉండాలి..
ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ 'వోగ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా టెండూల్కర్ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది. 'నా తల్లిదండ్రులు భార్యా భర్తల కంటే ముందు మంచి ఫ్రెండ్స్. వారి మధ్య జరిగే సరదా సంభాషణలను నేను నిత్యం గమనిస్తుంటా. నాకు లభించే భాగస్వామి నుంచి కూడా నేను అదే స్నేహాన్ని కోరుకుంటున్నా. మా అమ్మ నాన్నల మధ్య ఎలాంటి ఆధిపత్య ధోరణి ఉండదు. వారి అన్యోన్యతే నాకు స్ఫూర్తి.
పెళ్లి విషయంలో సమాజం లేదా కుటుంబం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లకు తలొగ్గి నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. ఈ తరం భాగస్వామి సరైన వ్యక్తి కాదని తెలిస్తే.. నిశ్చితార్థం తర్వాత కూడా బంధాన్ని వదులుకోవడానికి వెనుకాడటం లేదు. మా ముందు తరాల వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించేవారు. కానీ నేటి జెన్ జీ తరం తమకు నచ్చని విషయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

