Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్ లవ్ ఆమెనే.. నేను కాదు: సారా అలీ ఖాన్

Sara Ali Khan reveals Shubman Gill love: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో తాను డేటింగ్ చేయడం లేదని బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ స్పష్టం చేసింది. శుభ్‌మన్ గిల్ జీవితంలో మరో సారా ఉందని, తాను కాదని స్పష్టం చేసింది. ఇక శుభ్‌మన్ గిల్, సారా అలీఖాన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఈ ఇద్దరూ ఓ కాఫీ షాప్‌లో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది. అప్పటి వరకు సచిన్ టెండూల్కర్ గారాల పట్టీ సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్ ప్రేమలో ఉన్నాడని భావించిన ఫ్యాన్స్, మీడియా.. సారా అలీఖాన్, శుభ్‌మన్ గిల్ కాఫీ షాప్‌లో కనిపించడంతో ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని అపార్దం చేసుకున్నారు. సారాతో శుభ్‌మన్ గిల్ బ్రేకప్ చేసుకున్నట్లు కూడా వార్తలు రాసేసారు.

 Sara Ali Khan confirms ‘other Sara’ in Shubman Gill’s life

కానీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పుణే, ముంబై వేదికగా జరిగిన భారత మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరవ్వడం.. శుభ్‌మన్ గిల్‌కు మద్దతుగా నిలవడంతో మరోసారి ఈ ఇద్దరి ప్రేమాయణం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా శ్రీలంకతో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేజార్చుకున్నప్పుడు సారా టెండూల్కర్ బాధపడటం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు బలం చేకూర్చింది.

అంతేకాకుండా ఈ మ్యాచ్‌కు ముందు ముంబైలోని జియో ప్లాజా ఓపెనింగ్ కార్యక్రమానికి శుభ్‌మన్ గిల్‌తో పాటు సారా టెండూల్కర్ హాజరవ్వడం.. పబ్లిక్‌గా ఇద్దరీ కామన్ ఫ్రెండ్స్‌ను హగ్ చేసుకోవడంతో వీరి మధ్య ఎలాంటి బ్రేకప్ జరగలేదని విషయం స్పష్టమైంది. తాజాగా సారా అలీ ఖాన్ సైతం శుభ్‌మన్ గిల్ జీవితంలో మరో సారా ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది.

కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన సారా అలీఖాన్‌ను శుభ్‌మన్ గిల్‌తో ఉన్న ఎఫైర్‌ గురించి ప్రశ్నించగా.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. 'ప్రపంచం మొత్తం శుభ్‌మన్ గిల్ జీవితంలో ఉన్న సారా విషయంలో పొరబడుతోంది. అతని జీవితంలో ఉన్నా సారా వేరే. నేను కాదు'అని నవ్వుతూ బదులిచ్చింది.

సారా అలీఖాన్ వ్యాఖ్యలతో శుభ్‌మన్ గిల్ జీవితంలో ఉన్నది సారా టెండూల్కర్ అనే విషయం స్పష్టమైంది. ఈ విషయం సచిన్ టెండూల్కర్‌ ఫ్యామిలీకి కూడా తెలుసని, ఈ ఇద్దరి ప్రేమకు వారు అంగీకారం కూడా తెలుపారని ప్రచారం జరుగుతోంది. టీమిండియా భవిష్యత్తు సారథి‌ అయిన శుభ్‌మన్ గిల్‌ను అల్లుడిగా చేసుకునేందుకు సచిన్ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Story first published: Monday, November 6, 2023, 19:01 [IST]
Other articles published on Nov 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+