Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజూ శాంసన్ కొంపముంచుతున్న పుల్ షాట్.. అంబటి రాయుడి సలహా బేఖాతర్!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ వైఫల్యం కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ కేరళ బ్యాటర్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 26 పరుగులతో పర్వాలేదనిపించినా.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 5,3,1 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో శాంసన్ ఒకే తరహా షాట్ ఆడి వెనుదిరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

దూకుడైన ఆటతో బౌలర్లపై మెరుపు దాడి చేసే సంజూ శాంసన్‌ను ఇంగ్లండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బాల్స్‌తో బోల్తా కొట్టిస్తున్నారు. తొలి మూడు టీ20ల్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో పుట్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్న శాంసన్.. నాలుగో టీ20లో మాత్రం సకీబ్ మహమూద్ బౌలింగ్‌లో అదే పుల్ షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. పుల్ షాట్ సంజూ శాంసన్‌కు బలహీనతగా మారింది. దాంతో సంజూకు ఇంగ్లండ్ బౌలర్లు ఊరించే బౌన్సర్లతో రెచ్చగొడుతున్నారు. అందుకు తగ్గ ఫీల్డ్ సెటప్ పెట్టి బోల్తా కొట్టిస్తున్నారు.

Sanju Samson s struggles continue against short balls in England T20Is

రాయుడి సలహా బేఖాతర్..
వ్యూహాత్మకంగా ఇంగ్లండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బాల్స్ వేస్తున్నారని తెలిసి కూడా సంజూ.. వారిపై ఎదురుదాడికి దిగాలనే ఆలోచనతో వికెట్ పారేసుకుంటున్నాడు. దాంతో సంజూకు షాట్ పిచ్ బాల్ బలహీనతగా మారిందనే చర్చ జోరందుకుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సంజూ నెట్స్‌లో తీవ్రంగా ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ప్లాస్టిక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడని, పుల్ షాట్ ఆడే క్రమంలో చేస్తున్న తప్పిదాలపై ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. కానీ నాలుగో టీ20లో మాత్రం సంజూ మరోసారి అదే పేలవ పుల్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు అంబటి రాయుడి సంజూ శాంసన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు కీలక సలహా ఇచ్చాడు. సంజూ శాంసన్‌కు పుల్ షాట్ ఏ మాత్రం బలహీనత కాదని, టెక్నిక్‌లో మాత్రమే లోపం ఉందని చెప్పాడు.

సంజూ జరిగి పుల్ షాట్ ఆడుతున్నాడని, దాంతో చేతులు ఓపెన్ అవ్వక బంతి కనెక్ట్ అవ్వడం లేదని తెలిపాడు. సంజూ జరిగి ఆడకుండా లైన్‌లో షాట్ ఆడాలని సూచించాడు. అంతేకాకుండా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్లకు ప్రయత్నించవద్దని చెప్పాడు. అయితే ఈ సలహాను సంజూ బేఖతరు చేశాడు. మళ్లీ జరిగి పుల్ షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ సారి ఇంకా వికెట్లకు దగ్గరగా వెళ్లి మరి పుల్ షాట్ ఆడాడు.

సూర్య సైతం..
మరోవైపు క్రీజులో సెట్ అయ్యేవరకు ఓపికగా ఆడాలని సూర్యకు రాయుడు సూచించగా.. అతను ఆరంభంలోనే షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇక సంజూ శాంసన్ ఈ షార్ట్ పిచ్ బాల్స్ బలహీనతను అధిగమించకపోతే.. ఐపీఎల్‌లో కూడా ప్రత్యర్థి బౌలర్లు ఇదే అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. గతంలో శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే సమస్యతో బాధపడి భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ బలహీతనను అధిగమించకపోతే సంజూ కెరీరే ముగుస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Story first published: Saturday, February 1, 2025, 12:15 [IST]
Other articles published on Feb 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+