బెస్ట్ టీ20 ప్లేయర్ అవార్డ్.. సంజూ శాంసన్ భావోద్వేగం
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను CEAT బెస్ట్ టీ20 ప్లేయర్ అవార్డ్ వరించింది. గతేడాదిగా టీ20ల్లో సంజూ శాంసన్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీల మోత మోగించాడు. బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై మూడు శతకాలు నమోదు చేశాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో శుభ్‌మన్ గిల్ రాకతో మిడిలార్డర్‌లో ఆడిన సంజూ మెరుగైన ప్రదర్శనే చేశాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతనికి CEAT బెస్ట్ టీ20 క్రికెట్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా సంజూ శాంసన్ భావోద్వేగానికి గురయ్యాడు.

గతేడాది బంగ్లాదేశ్, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో సెంచరీలు చేయడం తన జీవితాన్ని మలుపు తిప్పిందన్నాడు. ఈ అవార్డ్‌ను తన సతీమణి చారుకి అంకితమిస్తున్నట్లు సంజూ తెలిపాడు. తన క్రికెట్ జర్నీలో అండగా నిలిచిందని చెప్పాడు. అభిమానుల మద్దతులోనే ఈ అవార్డ్ సాధ్యమైందని, వారు లేకుంటే సంజూ లేడని స్పష్టం చేశాడు. తనను తాను కూడా అభినందించుకోవాలని చెప్పాడు.
'బయట ఏం జరిగినా పట్టించుకోకుండా నా పనిని నేను కొనసాగించాను. శారీరకంగా, మానసికంగా ఎదురైన అడ్డంకులను ఓపికతో అధిగమించాను. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నాకు అవకాశం దక్కింది. ఐదు మ్యాచ్‌ల వ్యవధిలోనే మూడు మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు బాదాను. ఈ అద్భుతమైన క్షణాలను అందించిన ఆ దేవుడికి ధన్యవాదాలు. దేశం కోసం మరింత కష్టపడుతాను.
భారత జట్టుకు ఆడే అవకాశం కోసం చాలా శ్రమించా. దేశానికి ఆడటాన్ని గౌరవంగా భావిస్తా. జట్టు కోసం అవసరమైతే 9వ స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా చేసేందుకు నేను సిద్దం. నా 10 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ జర్నీలో నేను 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications